ప్రేమ ఉందనీ అనుకుంటావు, లేదనీ అనుకుంటావు-
ఎవరివైనా చేతివేళ్లు మెత్తగా పెదాల్ని తాకితే, సర్వం మరచి
తిరిగి అన్నిటినీ నమ్ముదామనీ అనుకుంటావు-
అప్పుడు
ఇక ఆ చేతివేళ్ళని పదాలుగా ఊహిస్తావు. నిన్ను చూడగానే
పూవులు విచ్చుకునే కనులగానూ
పచ్చిక బయళ్ళపై అలవోకగా వీచే
చిరుగాలి వంటి ఒక చిర్నవ్వుగానూ
స్వప్నిస్తావు. నీలోపలే, రహస్యంగా
ఒక దీపం వెలిగించుకుని, ఒక తోటని సృష్టించుకుని
స్వప్న సువాసన చలించే, 'నువ్వు'
అనే కొన్ని పదాలని రాసుకుంటావు
"ఇదేమిటి?" అని అడిగిన వాళ్లకి
"ఇదంతా ఒట్టిది. ఈ దీపపు కాంతి నిన్నటిది.
ఈ కవిత కూడా నిన్నటిదే. ఒక
వడలిన పూవుదే. వెలసిన ఒక
వానదే. వీడిన వానని వదలలేక
ఆకుల చివరన ఊగిసలాడే ఒక చినుకుదే
నువ్వు ఇంకిపోలేని కాంతిలోని
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సుదే.
మరి ఇది ఇప్పుడు నీ ఎదురుగా
గూడు కట్టుకుంటున్న ఒక పిచ్చుకదే: దాని ముక్కులోని ఒక పుల్లదే"
అని చెబితే, అంతా విని "మరి ఇంతకూ
ప్రేమ ఉందని అంటావా లేదని అంటావా?
సరే ఇది చెప్పు:నిన్ను నమ్మడం ఎలా?"
అని తనో - వాళ్ళో అడిగితే, అతి మెత్తగా
వాళ్ళ పెదాలపై నీ చేతివేళ్ళని ఉంచి ఇలా అంటావు:
"ష్. ఇక మాట్లాడకు. అంతా నిశ్శబ్ధం -
వేళ దాటింది. హృదయం వెలిగింది
మౌనం మాట్లాడింది. ఇక ఈ కవితను
ఇలా ముగిద్దాం, మనిద్దరమూ:"
'ప్రేమ ఉందనీ అనుకోకు, ప్రేమ లేదనీ అనుకోకు. ఎవరి పెదాలపైనో
చేతివేళ్ళయ్యో, చిరునవ్వయ్యో, ఒక
దీపపు కాంతి అయ్యో వెలిగాక, ఒక
లేత పిలుపై తేలిపోయాక, ఇక నీకు
పదాలతో కానీ, శబ్ధాలతో కాని, ప్రేమతో కానీ
ప్రేమారాహిత్యంతో కానీ పని ఏమిటి?"

No comments:
Post a Comment