పర్వీన్
స్కూలుకి ఎలా వెళ్ళవచ్చు?
వేకువఝామున స్నానం చేసిన చందమామల్లాగా
లేదా, స్నానం చేసి అల్లరి చేసే చందమామల్లాగా వెళ్ళవచ్చు -
గాలికి ఊయలలూగే అశోకా చెట్లల్లాగా, గుంపుగా
గుబురు పొదల మధ్య సవ్వడి చేసే చిన్ని పక్షుల్లాగా వెళ్ళవచ్చు - లేదా
వేకువఝామున స్నానం చేసిన చందమామల్లాగా
లేదా, స్నానం చేసి అల్లరి చేసే చందమామల్లాగా వెళ్ళవచ్చు -
గాలికి ఊయలలూగే అశోకా చెట్లల్లాగా, గుంపుగా
గుబురు పొదల మధ్య సవ్వడి చేసే చిన్ని పక్షుల్లాగా వెళ్ళవచ్చు - లేదా
చిన్నారి యోధుల్లా, చిక్కటి అడవిలో దారి ఏర్పరచుకుంటూ
సాగిపోయే వేటగాళ్ళలాగానూ వెళ్ళవచ్చు - కానీ,
చాలాసార్లు, నడిచే మొక్కల్లాగా, కళ్ళల్లో ముళ్ళతో
బడికి కాకుండా పనికి వెడుతుండవచ్చు. ఎలా అంటే
ప్రతి ఉదయం
ఆకుపచ్చని జాబిలిలా లేదా
తెల్లగా నవ్వే ఆకుపచ్చని జాబిలిలా, పర్వీన్ లా -

మరి పర్వీన్ ఎవరు?
ఆకుపచ్చని పరకిణీతో, చీపురు కట్టల రెక్కలతో
CIEFL లో చెత్త బుట్టలను శుభ్రం చేసే అయిదేళ్ళ అమ్మాయి -
ఇంద్రధనుస్సులేవీ లేని సీతాకోకచిలుక - కళ్ళను
లోకమంత విశాలంగా విప్పార్చి చూసే నీటి చినుకు -
ఆకుపచ్చని పరకిణీతో, చీపురు కట్టల రెక్కలతో
CIEFL లో చెత్త బుట్టలను శుభ్రం చేసే అయిదేళ్ళ అమ్మాయి -
ఇంద్రధనుస్సులేవీ లేని సీతాకోకచిలుక - కళ్ళను
లోకమంత విశాలంగా విప్పార్చి చూసే నీటి చినుకు -
మరి, పనికి ఎలా వెళ్ళవచ్చు?
కళ్ళ కింద లోకమంతా వానై రాలి పడుతున్నప్పుడు
రోజంతా తిండి లేక, రాత్రి నిదుర రాక, పాకపైనా
కళ్ళ కింద లోకమంతా వానై రాలి పడుతున్నప్పుడు
రోజంతా తిండి లేక, రాత్రి నిదుర రాక, పాకపైనా
పాకలోకీ, జనగణమనలాంటి సవ్వడి వలే, గులకరాళ్ళ వలే
జారి పడుతున్న వర్షపు చినుకులకి దూరంగా ఒక మూలకి వొదిగి
రాత్రి రెక్కలలోంచి, రెక్కలు నరుక్కునే పగటిలోకి
రాత్రి రెక్కలలోంచి, రెక్కలు నరుక్కునే పగటిలోకి
ఆకుపచ్చటి లంగా జాకెట్తో పర్వీన్ లా వెళ్ళవచ్చు -
తనకీ ప్రపంచం తెలుసు - గోళీకాయలా. కానీ ఒకటే రంగు
పేరేమీ లేనిది. పర్వీన్ లా, ఉనికి తప్ప అస్థిత్వం ఏమీ లేనిది -
మరి, ఇక తన ప్రపంచం ఏమిటి?
మొదటిది పని. చీపురు కట్టలు. లేదా
లతల్లా విచ్చుకున్న వేళ్ళ మధ్య శుభ్రమయ్యే ఎంగిలి పాత్రలు
పాలిపోయిన ఆకులలాంటి అరచేతులపై
చెంపలపై ఎర్రని గాయపు కోతలు -
రెండొవది ఆకలి. వాసనొచ్చే అన్నమైనా
బూజు పట్టిన బ్రెడ్డు తునకైనా చాలు - ఆకలి తీరాలి. రెండు
చిట్టి అరచేతులతో కడుపుని, లేదా

ఈ విశ్వమంతటి ఆకలిని నొక్కిపెట్టడం అసాధ్యం -
మరా క్షణాలలో, తన ప్రపంచం ఏమిటి?
రోదించడం. ఆకలిని తట్టుకోలేక, కుత్తుక తెగిన పావురంలా
చుట్ట చుట్టుకుని కొట్టుకులాడటం. తప్పదు. పోనీ
కనీసం మంచినీళ్ళు? పాకలోకి చొచ్చుకు వస్తున్న
నీటి కత్తుల మధ్య, అన్నం మెతుకులాంటి
ఒక నీటి బిందువైనా ఉండదు. తన చెంపలపై
జారే ఎంతో బరువైన కన్నీళ్ళలో, నక్షత్రంలాంటి

ఒక నీటి చినుకైనా ఉండదు. తను - ఆ పర్వీన్
ఆకుపచ్చని పర్వీన్ -
కమిలిపోయిన నెత్తురు కనుల పర్వీన్, ఆమె ప్రపంచం -
కలలు తప్ప మరేమీ లేని అన్నంలాంటి కనుల పర్వీన్
చిక్కని గంజిలాంటి కనుల పర్వీన్, చల్లని రొట్టెముక్క
దేహం గల పర్వీన్ , ఆమె ప్రపంచం -
అయితే, మరణం కంటే ఘాడమైన, హింసాత్మకమైన జీవితం కింద
తన లోకం లిప్తకాలం పాటు, వాన వెలిసాక విచ్చుకునే
సూర్యపుష్పం వలే, ఒకే ఒక్క క్షణం మెరుస్తుంది -

తను నిజంగా నవ్విన క్షణాలలో, అయిదేళ్ళ వయస్సు,
చిట్లిన విత్తనంలా ఫక్కుమని నవ్విన క్షణాలలో -
మరి, పర్వీన్ ఎప్పుడు నవ్వుతుంది?
ఆకుపచ్చని గడ్డిలో కలసిపోయి లేదా
తనే, విశాలమైన పచ్చిక మైదానంలా మారిపోయి
రోగగ్రస్థమైన కుక్కపిల్ల ఒకటీ, గుడ్డిదైన
కుక్కపిల్ల మరొకటీ - రెండిటితోనూ, వీచే గాలిలో
పరిగెడుతూ ఆడుకుంటున్నప్పుడు, సర్వం మరచి
వాటితో కలగలసిపోయి, స్వేచ్ఛగా పొర్లుతున్నప్పుడు
ప్రపంచమంతా ఒకే సవ్వడితో నిండిపోతుంది -
ఆకాశం నుంచి భూమి దాకా, ఎండిన మట్టిపై రాలే
చినుకుల శబ్దంలాంటి నవ్వుతో, పర్వీన్ నవ్వుతో
ప్రపంచమంతా, ఫక్కుమని ఫెటీల్మని పేలిపోయి
కనుల ముందు బూజుబూజుగా రాలిపడుతుంది
ఒక కన్నీటి బిందువులో బరువుగా మునిగిపోతుంది - మరి
పొరలు పొరలుగా, గాలి తెరల్లా విస్తరించుకుంటున్న ఆ శబ్దం
నవ్వు - పర్వీన్ నవ్వు - ఆ సవ్వడి
కన్నీటి బిందువులు రాలిపడుతున్న సవ్వడి
కనులు పిగిలిపోతున్న సవ్వడి
స్వేచ్చదా, లేక రేపటి నిర్భందానిదా?
________________________________
మొదటి సంపుటి 'కొన్ని సమయాలు' లోంచి
No comments:
Post a Comment