1
నీదేమీ లేదు ఇక్కడ.
కఫాన్ని ఊసివేసినట్టు, కిటికీలోంచి ఉమ్మేసిన నీ కళ్ళు
దొర్లుతాయి, అక్కడే
దారి పక్కన నీళ్ళల్లో-
కొంత బురద. ఏవో ఆకులు-
కనుల స్థానంలో ఏర్పడ్డ ఖాళీ గుంతలలో, రాలే చినుకులు-
చీకటి నీడలేవో సర్పాలై
దూరే నల్లటి బొరియలు.
2
అరచేతుల్లో పట్టుకున్న
కత్తి అంచున గొంతును ఆన్చి, నెమ్మదిగా తలని వాల్చుతూ
చేసే ఒక ఆఖరి ప్రార్ధన
ఈ రాత్రీ, ఈ శరీరం. ఇక
3
నిన్ను బేరీజు వేయకుండా
చూడగలిగే కన్నులే లేవు- ఇక్కడా, ఎక్కడా- ఎవరి వద్దా. చూడు...
ఏమీ లేదు
4
చీకట్లో
చెట్ల కింద ఒంటరిగా
ఒక మేనియాక్-

No comments:
Post a Comment