మృత్యువు నుంచి తప్పించుకుని వచ్చి , కూర్చుంది అమ్మాయి కుర్చీలో-
కొంచెం బావున్న వాన, ఇంకొంచెం బావున్న గాలీ, గాలిలో మెరిసే పూల తడీ
అన్నం మెతుకుల లాంటి వెలుతురూ
శిశువుల శరీరాల నుండి వీచే వాసనా
ఎవరో నిన్ను రహస్యంగా తాకి పిలిచే
ఒక పలుకూ, నిదురకీ మెలకువకీ మధ్య, ఒక పురాతన సీమలో, నువ్వు
చూసి వచ్చిన ఒక పురాస్మృతుల గడీ
తొలిసారిగా వక్షోజాలు బరువయ్యి, తల్లి తనమేదో తెలిసినట్టు, పసివేళ్ళతో
నీ ముఖాన్ని ఎవరో నిమిరినట్టూ, నీ
ఒడిలో జీవితం, పసిపాపై ఒదిగినట్టూ
తొలిసారిగా నిండుగా నవ్వినట్టు, శరీరం తేలికయ్యినట్టూ, తేలిపోతున్నట్టూ
మృత్యువుని వెళ్ళమని చెప్పి వచ్చిన
అమ్మాయి చుట్టూ, కొంత లేత కాంతి
నిండైన శాంతి, నడకలో నింపాదితనం
పసిడి పరకలు ఏవో వాలుతున్నట్టూ
తన కనుల సంజ్ఞల చుట్టూ, నువ్వు ఇంతకు మునుపు చూడని ఇంద్రజాలం-
అందుకే మరి, మృత్యువు దాగుడు మూతలలోంచి వచ్చి ఇక్కడ దాక్కున్న
అమ్మయిన ఆ అమ్మాయి, కుర్చీలో
కుదురుగా కూర్చుని, తేలికగా అలా
కాళ్ళూపుకుంటో చెబుతోంది ఇలా:
"ఇట్లా కాళ్ళూపుకోవడం, బ్రతికి ఉన్నామని తెలిసి ఉండటం...It's so beautiful
Isn't it? ఎందుకు తెలియలేదు మరి
ఈ చిన్ని విషయం నాకు ఇన్నాళ్ళూ?"

good one sir.
ReplyDelete