రకరకాలుగా వస్తారు వాళ్ళు-
రథయాత్రలుగానూ, పాతిక రూపాయల గంగా కలశాలు గానూ, పాతదైనా నూతనంగా, అఖిలభారత కృషి గోసేవా సంఘంగానూ -
రకరకాలుగా ప్రవేశిస్తారు వాళ్ళు-
ప్రజలలోకి, విద్యార్థులలోకీ, అంతిమంగా ఒక లక్ష్యానికి. మరి అది ఏమిటి? ఈ దేశముంది కదా, అది హిందూ దేశం. మరి హిందూ అంటే ఏమిటి? ముఖ్యంగా గోమాంసం తినక పోవడం. మారిత స్పష్టంగా, ముస్లింలను ద్వేషించడం. ఇక నువ్వెవరో వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వేం తినాలో, తినకూదదో
నువ్వెవరిని ప్రార్ధించాలో, నువ్వెవరిని పూజించాలో, నువ్వెవరిని ప్రేమించాలో రమించాలో కూడా వాళ్ళే చెబుతారు. ఎలా అంటే, ఉదాహరణకు, ఈ ఉదయంపూట
కరపత్రాలతో, కాలేజ్ విద్యార్థులపై వాలిన అఖిల భారత కృషి గోసేవా సంఘంలాగా. మరి, సాధారణంగా ఆ కరపత్రాలలో ఏం ఉంటుంది? గోహత్యను ఆపివేయండి అనే నినాదంతో పాటు, కొంత చరిత్ర కూడా. ఎటువంటి చరిత్ర? గోవులను హతమార్చడం ఒక దుష్టకార్యం అనే చరిథ్ర. మరి గోవులను హతమార్చేదెవరు? వాటిని ఆహారంగా భుజించేది ఎవరు? నా మిత్రుడొకడు నిరాశగా తల విదుల్చుతాడు-
"వీళ్ళు మారరు. సినిమా స్లైడ్స్తో దేశమంతటా తిరుగుతారట. బహుశా, ఒకటే సత్యం వీళ్ళకు, ఒకటే ప్రచారం వీళ్ళకు- చెప్పకుండా చెప్పి, ముస్లింలను ద్వేషించమని చెప్పడం, దొరికితే చంపమని చెప్పడం, చెప్పకుండా చెబుతూ-"
ఎదురుగా, క్లాసురూముల్లో, వాళ్లకి ఎదురుగా వందల కళ్ళు మసక బారుతున్నాయి. మరి కొద్దిసేపట్లో వందలాది స్వచ్చమైన హిందూ కళ్ళు తయారవుతాయి ఇక్కడ- FREEDOM 50- జీవితాన్ని కల్మషం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఇక్కడ. FREEDOM 50లో భాగంగా- మరి చూసారా/చూసుకున్నారా మీరు, ఇటువంటి మలినాన్ని ఎప్పుడైనా అక్కడైనా అస్పష్టంగానైనా?
-------------------------------------
1997.
-------------------------------------
1997.
No comments:
Post a Comment