1
తెరలు తెరలుగా పొడువాటి అదృశ్యపు తెరలను జాలు వార్చినట్టు
నింగి నుండి కిందకి దిగి, నిన్ను
ఉక్కిరి బిక్కిరి చేసే గాలి. తోటలో
పాదులను తవ్వుకుంటున్న నువ్వు, నెమ్మదిగా నీ నుదిటికి పైగా
అరచేతిని ఉంచుకుని పైకి చూస్తే
వలయాలుగా మంచురేణువుల్లా
కురిసే పల్చటి కాంతి:కొన్ని లక్షల
చామంతి పూరేకులు రాలిపడుతున్నట్టు, బిందువుల వంటి రెక్కలతో
2
చెట్ల కొమ్మల్లో, ఆకుల మధ్యలో
మిణుగురుల్లా మెరిసే-తడచిన-
వెలుతురూ. కనిపించనిది ఏదో
లేదా ఎవరో, నీ చెంత చేరి, నీ పక్కగా కూర్చుని, నీ చెవులో ఏదో రహస్యం
చెబుతున్నట్టు, ఎవరివో మరి
పాదాల సవ్వడి. నీ కళ్ళలోకి
నిశ్శబ్ధం, మరికొంత కొత్త నీరూ-
3
అప్పుడు
నీ చేతిని ఎవరో ఒత్తినట్టయ్యి
తల తిప్పి చూస్తావా, ఇక ఆ
పూవు చుట్టూ పూసిన సువాసనలో, అటు ఇటూ ఒక లయతో ఎగురుతున్న
ఓ లేతెరుపు సీతాకోకచిలుక-
నీ చుట్టూ ఒక ఆత్మ వేణువు
మట్టి కుండలో చేరి విలపించే
గాలి. ఒడ్డున ఆగి ఆ అలలలో
అటూ ఇటూ ఊగే, ఒక నావ.
తన తల్లి పొదుగుని చేరలేక, కట్టిన గుంజెకు గింజుకులాడే ఒక దూడ. ముళ్ళు
చివరన చిట్లినట్టై ఆ తల్లి కళ్ళూ.
4
ఇక
నీకు గుర్తుకు వస్తుంది అప్పుడో
ముఖం. ఛాతిలో ఒక నొప్పి- నీ
చుట్టూ సమస్థం అద్దాలై ఎటు చూసినా నీ ప్రతిబింబం బదులు మరొకరి ముఖం-
5
నువ్వు ఇది చదివే సమయానికి
నేను ఉండకపోవచ్చు.నీ ముందు
ఇక, ఊగుతూ, నిప్పు వలే గాలికి
ఎగిసి పోతూ, చలించి పోతూ ఇక
చివరిగా ఆరిపోతూ, మట్టి లోంచి
ఒక చేతికై మొలుచుకు వచ్చిన మరో చేయి వలే, తపిస్తూ రెపరెపలాడే
ఒక ఒంటరి గడ్డి పరక- దూరంగా
6
చేయి ఆయినా ఊపకుండా, నిను
వీడి వెళ్ళిపోతున్న నీకు అత్యంత
ప్రియమైన వారెవరో: మసకగా, పూర్తిగా కురవక, కనుమరుగయ్యే వానై ఇక్కడ-
ఇక
7
ఈ దినం గడవటం ఎలా?

ఎలా చెప్పను? Nice expression.
ReplyDelete