1
సాయిబు ఎవరో సాంభ్రాణీ ఊది, తన చేతిలోని నెమలీకల గుచ్ఛాన్ని
నీ తలపై ఉంచి దీవించినట్టు, నువ్వు మరచిన వారెవరో
-ఈ నగర రణగొణుధ్వనుల్లో- నిను తట్టి పిలిచినట్టు, ఈ
చల్లని గాలి-
నీ కళ్ళ పైకి చినుకుల్లా జారుతూ, ఈ కాలుష్యంలో
నీ కళ్ళను శుభ్రం చేస్తూ అదే:నీ తల్లి నీకు తలంటు
పోసాక, తల తుడిచి, నీకు ఇంత ఉప్పుని తినిపిస్తే
కళ్ళు మంట పుట్టి నీళ్ళు తిరిగి, నీ చూపు శుభ్రంగా
మారుతుంది చూడు అలా: ఇక నువ్వు నీ తల్లి బొజ్జ
చుట్టూ చేతులు వేసి కావలించుకుంటే, పారుతుంది
గోరువెచ్చని వెలుతురు,హాయిగా, తన శరీరంలోంచి
నీ శరీరంలోకి- బయట గూళ్ళల్లో ముడుచుకున్న ఆ
చిన్ని చిన్ని ఊదా రంగుల పిట్టలు గుర్తుకు వస్తాయి
నీకు అప్పుడు: పైనేమో, కొంత లేత కాంతి తాకగా
కింద నేలపై మువ్వల్లా అలికిడి చేసే వేపాకుల నీడలు- ఇక అప్పుడు
2
నీ తల్లి ఆ దినాన తన పనికి వెడుతూ వెడుతూ, తను
నిన్ను దగ్గరగా తీసుకుని నీ నుదుట ముద్దాడితే,అదే
ఇక నీ రక్షణ కవచం. నిన్ను కాపాడే దైవ సింధూరం-
నీ జీవితానికి కట్టిన తాయెత్తూ, మరి అదే నీ లలాట లిఖితమూనూ-
ఇక ఇప్పుడు
3
రుతువులు మారి, లోకాలు మారి, కాలాలూ మారి, ఇదిగో ఇక్కడ
ఈ లోహ దర్పణాల మధ్య కూరుకుపోయి ఉన్నాను, దారి
తప్పిన ఒక సీతాకోక చిలుకని చూస్తూ, యంత్రాల ఊబిలో-
మరి అమ్మీ, ఎక్కడ వొదిలివేసాను, నను అపురూపంగా
కాపాడుకున్న నిన్నూ, చీకటిలో దీపాలు వెలిగించి నను
కడు జాగ్రత్తగా దాచుకున్న నీ అరచేతులనూ?

No comments:
Post a Comment