నీరెండ పడి
నీడలతో ఊగుతోంది నగర ఉద్యానవనంలోని
ఈ గాలి పూవు
దానిని పట్టుకుని
నీకు ఇద్దామనే ఆ పిల్లవాడి తపన అంతా
యిక చూడు
సీతాకోచిలుక వంటి గాలి వెనుక
రివ్వు రివ్వున పరిగెత్తుతాం
నేనూ ఒక చిన్న పిల్లవాడు
పోటీ పడి, రెక్కల్లేకుండా ఎగిరే కుక్కపిల్లలమై ఆ గాలి బంతి చుట్టూ-
యిక చూస్తావు నువ్వు
చిరునవ్వుతో కూర్చుని
క్షణికాలపు ఆ అనంతమైన దృశ్యాన్నీఆనందాన్నీ
అరచేతిలో ముఖాన్ని వాల్చుకున్న
ఈ సాయంత్రపు కనకాంబరపు పూల కాంతిలో-
---యిక ఆ వర్షపు రాత్రిలో
కొవ్వొత్తి కాంతిలో మనం
అన్నం తినే వేళల్లో
అడుగుతాడు కదా
మన పిల్లవాడు- 'అమ్మా
ఇందాక మనం తెచ్చుకున్న
పూవు ఎక్కడ ఉంది?'
30 June 2012
అర్హత
చీకట్లో
ఈ చీకటి గులాబి రేకులను
తెంపుతూ కూర్చున్నాను
నీ ఎదురుగా
విసురుగా వీచే చీకట్లో
గాలికి రాలకుండా గుప్పెడు
వెలుతురు ప్రాణం పోకుండా
ఆ కొవ్వొత్తి చుట్టూ
అర చేతులు కప్పి
కూర్చున్నావు
నువ్వేమో నా
ధూళి నిండిన కళ్ళల్లో-
ఇంతకూ
రెమ్మలు
పెరికే విషాద హ్రుదయుడైన మనిషికి
నిశి గంధంలో నిప్పుల వాన వలె రాలి
వికసించిన
పసిడి జ్వాలైన నీ ముఖంతో
తన చేతులు కడుక్కునే
అంతిమ అర్హతా ఒక
ప్రాయశ్చిత్తం ఉందా?
ఈ చీకటి గులాబి రేకులను
తెంపుతూ కూర్చున్నాను
నీ ఎదురుగా
విసురుగా వీచే చీకట్లో
గాలికి రాలకుండా గుప్పెడు
వెలుతురు ప్రాణం పోకుండా
ఆ కొవ్వొత్తి చుట్టూ
అర చేతులు కప్పి
కూర్చున్నావు
నువ్వేమో నా
ధూళి నిండిన కళ్ళల్లో-
ఇంతకూ
రెమ్మలు
పెరికే విషాద హ్రుదయుడైన మనిషికి
నిశి గంధంలో నిప్పుల వాన వలె రాలి
వికసించిన
పసిడి జ్వాలైన నీ ముఖంతో
తన చేతులు కడుక్కునే
అంతిమ అర్హతా ఒక
ప్రాయశ్చిత్తం ఉందా?
27 June 2012
ఎవరు?
రమణ సన్యాసిని అడిగెను ఒక పిచ్చి సన్నాసి
రమణా రమణా తానొప్పక
ఇతరులని నొప్పించక నందరినీ ఒప్పించుచూ
ఈ ముఖ గోడలపై ఎగిరే
ఆ వానరములను తిరిగి
మానవాశ్రములలకు తరలించుట నెటుల సాధ్యము?
నవ్వి నవ్వి యాతడు
యాతన లేక తన తోక
చూపించెను ఊపుతో-
రమణా రమణా తానొప్పక
ఇతరులని నొప్పించక నందరినీ ఒప్పించుచూ
ఈ ముఖ గోడలపై ఎగిరే
ఆ వానరములను తిరిగి
మానవాశ్రములలకు తరలించుట నెటుల సాధ్యము?
నవ్వి నవ్వి యాతడు
యాతన లేక తన తోక
చూపించెను ఊపుతో-
యవ్వనం
పూల మీద ఆగి
అగ్ని మీద వాలి
సీతాకోకచిలుకలై నల్లని అశ్వాలై
ఛాతి విరుచుకుని
కళ్ళు తెరుచుకుని
ఒక కొత్త ఆనందంతో
ఒక కొత్త సుఖంలోకి
మెత్తని మత్తైన
ఆ లోకాలలోకి
బిడియంగా గొడవగా
అలా దుముకుతారు
తమ నాభి కింద
వచ్చిన రెక్కలతో
అలజడిగా
అశాంతిగా
కదిలే ఆ నునుపైన
గరకు యవ్వనంతో
ఈ పిల్లలు!
అగ్ని మీద వాలి
సీతాకోకచిలుకలై నల్లని అశ్వాలై
ఛాతి విరుచుకుని
కళ్ళు తెరుచుకుని
ఒక కొత్త ఆనందంతో
ఒక కొత్త సుఖంలోకి
మెత్తని మత్తైన
ఆ లోకాలలోకి
బిడియంగా గొడవగా
అలా దుముకుతారు
తమ నాభి కింద
వచ్చిన రెక్కలతో
అలజడిగా
అశాంతిగా
కదిలే ఆ నునుపైన
గరకు యవ్వనంతో
ఈ పిల్లలు!
26 June 2012
నిర్యాణం
కోపంతో పిల్లల మీద ఎగిరినా
కోపంతో లోకం మీద ఎగిరినా
లోకం మీద కోపంతో పిల్లల మీద ఎగిరినా
పిల్లల మీద కోపంతో లోకం మీద ఎగిరినా
రెండూ ఒకటే
ఇంతా చేసి
బావి నీళ్ళను దాచుకున్న మట్టి కుండలా
వానని దాచుకున్న వేప చెట్టులా
నువ్వు అలా ఉండగలిగితే చాలు:
నువ్వీ ఈ రాత్రికి బ్రతికి పోయినట్టే-
కోపంతో లోకం మీద ఎగిరినా
లోకం మీద కోపంతో పిల్లల మీద ఎగిరినా
పిల్లల మీద కోపంతో లోకం మీద ఎగిరినా
రెండూ ఒకటే
ఇంతా చేసి
బావి నీళ్ళను దాచుకున్న మట్టి కుండలా
వానని దాచుకున్న వేప చెట్టులా
నువ్వు అలా ఉండగలిగితే చాలు:
నువ్వీ ఈ రాత్రికి బ్రతికి పోయినట్టే-
నా శాపశోకం
రెండు చుక్కల అత్తరు
రెండు చుక్కల కన్నీరు
రెండు చేతుల మధువు
నీ ఖాళీ పాత్రల కనుల నిండా తన రెండు తల్లి కౌగిళ్ళ
లాలించే పాలిండ్లు, పురా జోలపాటలు ఒడి ఊయళ్ళు-
తనువు రేగిపోయిన
నగర రహదారులని
రాత్రుళ్ళతో విసిరి వేసే గాలులలో
తన లేత ముఖాన్ని నీ ముఖంపై
నిండుగా కప్పుకుని నునువెచ్చగా
ముడుచుకుని పడుకోక పడుకునీ
నిదుర రాక, పోతే
ఒరే లిఖితుడా, నా ఆదిమ భిక్షుకుడా
మెరుపులు పగిలే వేళల్లో ఈ కాలాల్లో
యిక ఇంతకు మించిన శాపం - శోకం
యింకా ఏదైనా మిగిలి ఉందా నీకు-?
రెండు చుక్కల కన్నీరు
రెండు చేతుల మధువు
నీ ఖాళీ పాత్రల కనుల నిండా తన రెండు తల్లి కౌగిళ్ళ
లాలించే పాలిండ్లు, పురా జోలపాటలు ఒడి ఊయళ్ళు-
తనువు రేగిపోయిన
నగర రహదారులని
రాత్రుళ్ళతో విసిరి వేసే గాలులలో
తన లేత ముఖాన్ని నీ ముఖంపై
నిండుగా కప్పుకుని నునువెచ్చగా
ముడుచుకుని పడుకోక పడుకునీ
నిదుర రాక, పోతే
ఒరే లిఖితుడా, నా ఆదిమ భిక్షుకుడా
మెరుపులు పగిలే వేళల్లో ఈ కాలాల్లో
యిక ఇంతకు మించిన శాపం - శోకం
యింకా ఏదైనా మిగిలి ఉందా నీకు-?
అక్కడ
నేరేడుపండ్ల చీకటీ
చల్లని చినుకులూ
నిన్ను వలచి నిను గాట్టిగా కావలించుకున్న వర్షపు గాలి. యిక
చూడు అక్కడ
తడిచిన బండిపై
నీ హృదయంపై
ఎర్రటి బొగ్గులపై
ఆ పసుపు పచ్చని మొక్కజొన్నకంకులు ఎలా కాలుతున్నాయో-
చల్లని చినుకులూ
నిన్ను వలచి నిను గాట్టిగా కావలించుకున్న వర్షపు గాలి. యిక
చూడు అక్కడ
తడిచిన బండిపై
నీ హృదయంపై
ఎర్రటి బొగ్గులపై
ఆ పసుపు పచ్చని మొక్కజొన్నకంకులు ఎలా కాలుతున్నాయో-
మధువనం
యిక్కడ తాగి
అక్కడ తూగుతాం మనం చక్కగా
నోటినిండా పగిలిన తమలపాకుతో- యిక
నీ పెదాలపై నా ఆత్మ రక్తం
నీ నోటి నిండా ఏరిన
ఏలకుల సువాసన
నీ తడబడే నాలికపై
నా భవిష్యత్తు యింకా ఒక ఆకుపచ్చని రామచిలుక
గది నిండా చెల్లా చెదురైన రబీంద్రుని పదాల మధ్య
మంద్రంగా గమ్మత్తుగా
తూలె నీ చేతుల మధ్య
నీచే చేతబడి చేయబడిన నా శరీరం-
మధుబన్ మిత్రా మధువుతో మిత్రా
తాగినప్పుడు నీ తొమ్మిది అంతస్తుల
ఆ నిశిధి కాంతులలో
మనం తూలినప్పుడు
రాత్రి కుందేలుని వేటాడే
కోయ పిల్ల వలె నువ్వు
ఎంత అందంగా ఉన్నావ్!
అక్కడ తూగుతాం మనం చక్కగా
నోటినిండా పగిలిన తమలపాకుతో- యిక
నీ పెదాలపై నా ఆత్మ రక్తం
నీ నోటి నిండా ఏరిన
ఏలకుల సువాసన
నీ తడబడే నాలికపై
నా భవిష్యత్తు యింకా ఒక ఆకుపచ్చని రామచిలుక
గది నిండా చెల్లా చెదురైన రబీంద్రుని పదాల మధ్య
మంద్రంగా గమ్మత్తుగా
తూలె నీ చేతుల మధ్య
నీచే చేతబడి చేయబడిన నా శరీరం-
మధుబన్ మిత్రా మధువుతో మిత్రా
తాగినప్పుడు నీ తొమ్మిది అంతస్తుల
ఆ నిశిధి కాంతులలో
మనం తూలినప్పుడు
రాత్రి కుందేలుని వేటాడే
కోయ పిల్ల వలె నువ్వు
ఎంత అందంగా ఉన్నావ్!
code
ఇదిగో ఇలానే మాట్లాడుకుంటాం మేం
సన్నటి రాత్రుళ్ళ ధూపంలో చల్లారి
నిదుర కనులలోని కాటుక నీటిని
నువ్వు కొనవేళ్ళతో తుడిచి వేచి చూస్తున్నప్పుడు
ఇదిగో ఇలాగనే జన్మించి
తొలిసారిగా జీవిస్తాం మేం-
-'డ్రం డ్రం డ్రం
డ్రమాకి డ్రం
డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'
సన్నటి రాత్రుళ్ళ ధూపంలో చల్లారి
నిదుర కనులలోని కాటుక నీటిని
నువ్వు కొనవేళ్ళతో తుడిచి వేచి చూస్తున్నప్పుడు
ఇదిగో ఇలాగనే జన్మించి
తొలిసారిగా జీవిస్తాం మేం-
-'డ్రం డ్రం డ్రం
డ్రమాకి డ్రం
డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'
25 June 2012
తొర్రి పన్ను
నవ్వే వెన్నెల బుగ్గ
సొట్ట పడ్డట్టు, యిక
నువ్వు ఇకిలించినప్పుడల్లా నీ పెదాల మధ్య నుంచి
ఒక నక్షత్రం రాలి దానిమ్మ గింజై ఎటో ఎగిరిపోతుంది
ఆరి భగవంతుడా నా పిల్ల పిడుగా
తొర్రి పన్నోడా అని నిన్ను రేపు
తోటి పిల్లలు వెక్కిరిస్తారు కానీ
నాకే, రాబోయే
నా బోసి నోరు గుర్తుకు వచ్చి ఇప్పుడే
నా హృదయ వక్షోజాల నిండుగా నిండిన
తల్లితనపు పితృత్వ తొలి పాల హోరూ
శరీరమంతా ఒక తొలి ప్రేమ జలదరింపూ
నా కనుల నిండా ఒలికిన
నా పురాస్మృతుల, తొలి
మలి మృత్యు గులాబీల గుబాళింపు-
సొట్ట పడ్డట్టు, యిక
నువ్వు ఇకిలించినప్పుడల్లా నీ పెదాల మధ్య నుంచి
ఒక నక్షత్రం రాలి దానిమ్మ గింజై ఎటో ఎగిరిపోతుంది
ఆరి భగవంతుడా నా పిల్ల పిడుగా
తొర్రి పన్నోడా అని నిన్ను రేపు
తోటి పిల్లలు వెక్కిరిస్తారు కానీ
నాకే, రాబోయే
నా బోసి నోరు గుర్తుకు వచ్చి ఇప్పుడే
నా హృదయ వక్షోజాల నిండుగా నిండిన
తల్లితనపు పితృత్వ తొలి పాల హోరూ
శరీరమంతా ఒక తొలి ప్రేమ జలదరింపూ
నా కనుల నిండా ఒలికిన
నా పురాస్మృతుల, తొలి
మలి మృత్యు గులాబీల గుబాళింపు-
మంచిది
పోనీలే
నువ్వు లేచిపోవడమే
చాలా మంచిది - కానీ
అది యిక
నీతో నువ్వు అని
నీతో నువ్వేననీ
చెప్పకు
ఎవ్వరికీ
వెన్నెల పాలరాతి పాత్రలో
సూర్యపుష్పాన్ని ఉంచే నీ
శరీరం మెత్తగా నవ్వే ఆ
అరమోడ్పుల క్షణాన-
నువ్వు లేచిపోవడమే
చాలా మంచిది - కానీ
అది యిక
నీతో నువ్వు అని
నీతో నువ్వేననీ
చెప్పకు
ఎవ్వరికీ
వెన్నెల పాలరాతి పాత్రలో
సూర్యపుష్పాన్ని ఉంచే నీ
శరీరం మెత్తగా నవ్వే ఆ
అరమోడ్పుల క్షణాన-
నువ్వో, నేనో
ఎందుకో ఇష్టపడతావు నువ్వు -
నీడలు రాలిన మబ్బుల మధ్యాహ్నం
గాలితో తిరుగుతో
ఈ మట్టిన రాలిన
పూలలో ఒకదాన్ని ఒడిసి పట్టుకుని
జాగ్రత్తగా దుమ్ము దులిపి
అరచేతిలో దాచుకుంటావు
నువ్వు:ఎవరికి తెలుసును
యిక రాత్రికి పూర్తిగా వడలి
చినుకుల శోకంలోకి
ఎందుకో ఇష్టపడి కూడా
రాలిపోయేదీ
పాలిపోయేదీ
నువ్వో నేనో?
నీడలు రాలిన మబ్బుల మధ్యాహ్నం
గాలితో తిరుగుతో
ఈ మట్టిన రాలిన
పూలలో ఒకదాన్ని ఒడిసి పట్టుకుని
జాగ్రత్తగా దుమ్ము దులిపి
అరచేతిలో దాచుకుంటావు
నువ్వు:ఎవరికి తెలుసును
యిక రాత్రికి పూర్తిగా వడలి
చినుకుల శోకంలోకి
ఎందుకో ఇష్టపడి కూడా
రాలిపోయేదీ
పాలిపోయేదీ
నువ్వో నేనో?
ఎటువంటి లోకమిది
డబ్బయితే అడగగలవు
నీ పోపు డబ్బాలో దాచి ఉంచుకోగలవు
కొంగున ముడేసుకోగలవు: కానీ
థూ! ఎటువంటి అస్ప్రుస్యతా
దారిధ్ర్యపు శాపపు లోకమిది?!
ఆఖరకు
ప్రేమించమనీ
రమించ మనీ
కూడా ఎలా అడుక్కోవడం?
నీ పోపు డబ్బాలో దాచి ఉంచుకోగలవు
కొంగున ముడేసుకోగలవు: కానీ
థూ! ఎటువంటి అస్ప్రుస్యతా
దారిధ్ర్యపు శాపపు లోకమిది?!
ఆఖరకు
ప్రేమించమనీ
రమించ మనీ
కూడా ఎలా అడుక్కోవడం?
కృతఘ్నత
చీకట్లోంచి ఇన్ని చుక్కల్ని తెంపుకు వచ్చి
నా నుదిటిపై నీ నునుపైన వేళ్ళతో మెత్తగా రాసి
రాత్రి గాలిని చల్లగా
నా వొంటికి పూసి
నన్నైతే నువ్వలా పడుకోబెడతావు కానీ
నువ్వు కంటి నిండుగా
నిదురోయావో లేదో అని
గమనించానా నేను నిన్ను ఎన్నడైనా కనీసం మాట వరసకైనా
అడిగానా ఎప్పుడైనా నేను
నిన్నుఒక చిన్న మాటైనా?
నా నుదిటిపై నీ నునుపైన వేళ్ళతో మెత్తగా రాసి
రాత్రి గాలిని చల్లగా
నా వొంటికి పూసి
నన్నైతే నువ్వలా పడుకోబెడతావు కానీ
నువ్వు కంటి నిండుగా
నిదురోయావో లేదో అని
గమనించానా నేను నిన్ను ఎన్నడైనా కనీసం మాట వరసకైనా
అడిగానా ఎప్పుడైనా నేను
నిన్నుఒక చిన్న మాటైనా?
24 June 2012
విస్మయం
పరుపెక్కి కూర్చున్న నిద్రని
దాని చెవులు పట్టి లాగి లాగి
కాలితో తంతావు కదా దానిని అలా నువ్వు
మరి నిదురించాక నీ చెవులలో
రహస్యంగా నీ ఒక్కడికే ఆ
నిదుర ఏం వినిపించిందనీ
మరి తన్నిన నీ అరికాళ్ళపై అది
ఏ గాలి కితకితలని ఊదిందనీ నీ
లేత ఎరుపు పెదాలపై
మనోహరమైన
ఆ చిన్నినవ్వు?
దాని చెవులు పట్టి లాగి లాగి
కాలితో తంతావు కదా దానిని అలా నువ్వు
మరి నిదురించాక నీ చెవులలో
రహస్యంగా నీ ఒక్కడికే ఆ
నిదుర ఏం వినిపించిందనీ
మరి తన్నిన నీ అరికాళ్ళపై అది
ఏ గాలి కితకితలని ఊదిందనీ నీ
లేత ఎరుపు పెదాలపై
మనోహరమైన
ఆ చిన్నినవ్వు?
23 June 2012
బద్ధకం
విచ్చుకుంది ఎండ
పత్తి పూవులా
పచ్చి వెన్నెల్లా
గాలిని గాలి మైమరుపుగా తాకి
వానని వాటేసుకునే
బద్ధకపు క్షణాలలో- ఆహ్
హృదయంలోకి వెచ్చగా
నీ మధువును
పంపించేందుకు
ఇంత కంటే
మంచి కాలం మరేమి ఉన్నదీ?
పత్తి పూవులా
పచ్చి వెన్నెల్లా
గాలిని గాలి మైమరుపుగా తాకి
వానని వాటేసుకునే
బద్ధకపు క్షణాలలో- ఆహ్
హృదయంలోకి వెచ్చగా
నీ మధువును
పంపించేందుకు
ఇంత కంటే
మంచి కాలం మరేమి ఉన్నదీ?
జ్ఞాన సందేహం
సైదా
నాలోకి నువ్వు పూని
నీలోకి నేను ఆవహించి
ఆ రాత్రి
మనకు బదులుగా
మన ఇళ్ళకు
అలా వెళ్ళిన
చీకటిని కాల్చిన ఆ కాటి కాపరులు
ఎవరు?
నాలోకి నువ్వు పూని
నీలోకి నేను ఆవహించి
ఆ రాత్రి
మనకు బదులుగా
మన ఇళ్ళకు
అలా వెళ్ళిన
చీకటిని కాల్చిన ఆ కాటి కాపరులు
ఎవరు?
నా తప్పేం లేదు
ఇద్దరం కూర్చుని
ఎందరుగానో తాగి
యింకా దాహం తీరక యింకా తపన ఆరక
తల దాచుకునే
పొత్తిళ్ళు ఎక్కడా కానరాక
ఎక్కడికి వెళ్ళాలో తెలియక
తూలుతూ ఏడుస్తూ
ఒక తెల్లని వెన్నెలని
చేయుచ్చుకుని అర్థరాత్రిలో మనం సాగిపోతే
ఒకరినొకరు వీడలేక
వీడిపోతే వెళ్ళిపోతే...
అందులో నాదేం తప్పు?
ఎందరుగానో తాగి
యింకా దాహం తీరక యింకా తపన ఆరక
తల దాచుకునే
పొత్తిళ్ళు ఎక్కడా కానరాక
ఎక్కడికి వెళ్ళాలో తెలియక
తూలుతూ ఏడుస్తూ
ఒక తెల్లని వెన్నెలని
చేయుచ్చుకుని అర్థరాత్రిలో మనం సాగిపోతే
ఒకరినొకరు వీడలేక
వీడిపోతే వెళ్ళిపోతే...
అందులో నాదేం తప్పు?
ఎవరో
వేకువ గట్టునే లేచి
నిన్నొక రాత్రి నిదురించిన బొంతను చేసి
చక్కా చుట్ట చుట్టకుని వెళ్ళిపోయారెవరో
నీ ముఖాన కనీసం
ఇన్ని చల్లని నీళ్ళైనా
చిలుకరించక
పలుకరించక-
యిక ఆ తరువాత
అద్దంలో చూసుకుంటూ
తనలో తాను
నవ్వుకుంటూ
బొట్టుపెట్టుకున్న
ఆ ప్రతిబింబం
ఆ రూపం
ఎవరిది-?
నిన్నొక రాత్రి నిదురించిన బొంతను చేసి
చక్కా చుట్ట చుట్టకుని వెళ్ళిపోయారెవరో
నీ ముఖాన కనీసం
ఇన్ని చల్లని నీళ్ళైనా
చిలుకరించక
పలుకరించక-
యిక ఆ తరువాత
అద్దంలో చూసుకుంటూ
తనలో తాను
నవ్వుకుంటూ
బొట్టుపెట్టుకున్న
ఆ ప్రతిబింబం
ఆ రూపం
ఎవరిది-?
మరి ఉందా నీ వద్ద
మరి
ఉందా నీ వద్ద
ఏదో ఓ పలక
అలక లేకుండా?
ఇక నీ వేళ్ళతో
నువ్వు అలా
వెన్నెలనే రాస్తావో
నల్లని చీకటిని
ఉమ్మితో తుడిచే
వేస్తావో
చొక్కా కాలర్
నములుకుంటూ
గుండ్రంగా
వంకర గా
నాలుగు గీతేలే
గీస్తావో తిరిగి
కొట్టే వేస్తావో
నాలిక నిండా
ఐస్క్రీమె వేస్తావో
చెట్లెక్కి తిరిగి
పురుగులనీ
పిట్టలనే తెస్తావో
గజిబిజిగా కోపంగా
అక్షరాలే రాస్తావో
దాస్తావో నవ్వుతావో
మరి అదంతా
నీ ఇష్టం కానీ
మరి ఇంతకూ
ఉందా నీ వద్ద
ఏదో ఒక తెల్లని
హృదయం పలకా
ఒక బలపపు
పలుకరింతా?
ఉందా నీ వద్ద
ఏదో ఓ పలక
అలక లేకుండా?
ఇక నీ వేళ్ళతో
నువ్వు అలా
వెన్నెలనే రాస్తావో
నల్లని చీకటిని
ఉమ్మితో తుడిచే
వేస్తావో
చొక్కా కాలర్
నములుకుంటూ
గుండ్రంగా
వంకర గా
నాలుగు గీతేలే
గీస్తావో తిరిగి
కొట్టే వేస్తావో
నాలిక నిండా
ఐస్క్రీమె వేస్తావో
చెట్లెక్కి తిరిగి
పురుగులనీ
పిట్టలనే తెస్తావో
గజిబిజిగా కోపంగా
అక్షరాలే రాస్తావో
దాస్తావో నవ్వుతావో
మరి అదంతా
నీ ఇష్టం కానీ
మరి ఇంతకూ
ఉందా నీ వద్ద
ఏదో ఒక తెల్లని
హృదయం పలకా
ఒక బలపపు
పలుకరింతా?
నా
నా జనన మరణ
మార్మిక తంత్రం
నా ఆది శోకం అంతిమ విలాపం
నా తొలి ప్రేమా
నా మలి ద్వేషం
నా చివరి శాపం
నా ఏకాక్షర మంత్రం
నా ద్వివిధ కాంతిరూపులు
నా ద్వివిధ ఆత్మలూ
నా త్రికాలాలూ
నా చతురాశ్రమములు
నా పంచభూతములు
నా పంచమహాపాతకాలు
నా షడ్గుణైస్వర్యములు
నా సప్త లోకాలూ
నా సప్తవ్యసనాలూ
నా సప్త జన్మలూ నా సప్త మరణాలూ
నా అష్టాంగ మార్గాలూ
నా నవ సంబంధాలూ
ఇంతకు మినహా
ఇంతకు మించీ
--ఏమీ లేవు--
22 June 2012
ఆట
నా అరచేతుల్లోకి
నీ ముఖాన్నిలాక్కుని
ముద్దు పెట్టుకున్నాను
సరిగ్గా ఆప్పుడే
నువ్వు కనురెప్పలు వాల్చిన ఆ
క్షణంలోనే రాలిన
ఓ వాన చినుకులో
ఒక ఉద్యానవనం విరగబూసింది
చూడు ఇలా
యిక ఇద్దరి మధ్యా
అలా ఎదిగిన పూల
వెన్నెల పరిమళపు తోటా తేనె పిట్టల ఆటా
నీదీ కాదు నాదీ కాదు!
నీ ముఖాన్నిలాక్కుని
ముద్దు పెట్టుకున్నాను
సరిగ్గా ఆప్పుడే
నువ్వు కనురెప్పలు వాల్చిన ఆ
క్షణంలోనే రాలిన
ఓ వాన చినుకులో
ఒక ఉద్యానవనం విరగబూసింది
చూడు ఇలా
యిక ఇద్దరి మధ్యా
అలా ఎదిగిన పూల
వెన్నెల పరిమళపు తోటా తేనె పిట్టల ఆటా
నీదీ కాదు నాదీ కాదు!
21 June 2012
otobiography*
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు ఒక బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని వాడు వేసే కేకలన్నిటినీ కాగితంపై రాస్తూ ఉంటాను. ఎవరైనా బిగ్గరగా రోదిస్తూ గుండెలు చరచుకుని వెక్కిళ్ళతో నేలకొరిగిపోతుంటే సంవత్సరాలుగా రాసుకున్న పిల్లల పదాల కేకలని వాళ్ళ ముందు ఉంచుతాను. కొన్నిసార్లు తరగతి గదుల్లో పిల్లలకు పాటాలు చెప్పుకుంటాను. వాళ్లు ఆ పుస్తకాలు చదువుకుని బావుకునే దేమీ లేదని తెలిసీ, అ విషయమే వాళ్లకు మరోసారి చెప్పి, మళ్ళా వచ్చే ఏడాది అవే పాటాలు అప్పజేపుతాను. విసుగొచ్చిన విద్యార్థులకు వినమని గద్దర్ పాటలనూ చదవమని పతంజలి పుస్తకాలనీ ఇస్తుంటాను. భూమి బల్లపరపుగా ఉందని ఒక విద్యార్ధి సంవత్సరం తరువాత కనపడి చెబితే అతడి ముందు నేను చేతులు కట్టుకున్న బాలుడని అవుతాను.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు ఇదిగో ఇటువంటి పదాలను వొంటరిగా కూర్చుని చెక్కుకుంటాను. చెక్కుతున్న ఉలి గురి సరిగ్గా ఉండి దేహంపై గాట్లు పడితే, ఊరుతున్న రక్తాన్ని తుడుచుకుని, మళ్ళా మళ్ళా శిలకు ప్రాణం వచ్చేదాకా నా గొంతుని నరుక్కుంటాను. పగలు సూర్యుడు మేఘాల మధ్యకు అద్రుశ్యమైతే, మరో అంచు నుంచి నేను చంద్రుడిని వెలుపలికి లాగుతాను. రాత్రిపూట చీకటి కటినంగా చుట్టుకున్నప్పుడు ఉదయం దాచిపెట్టుకున్న సూర్యరశ్మిని కట్టెలకు చుట్టి కాగాదాల్లా వెలిగిస్తాను. దారి పొడుగూతా కమిలిన రక్తం పేగుల్లా చెల్లాచెదురై పడి ఉన్న పురుషోత్తం, ఆజంలూ కనిపించి నప్పుడు అరచేతుల మధ్య ఇంత నిప్పుని రాజేసుకుని కనుగుడ్లలో కుక్కుకుంటాను.
కొన్నిసార్లు, మధ్యాహ్నం ఇంట్లోకి మూడు రోజులకొకసారి వచ్చే నీళ్ళని పదిలంగా పట్టుకుంటాను. ఆ తరువాత ఎండ కుబుసం రాలుతున్న వేప చెట్టు కింద నీడల్ని ఆకులకి అంటిస్తూ నా తార తరాల మనుషుల శ్రమను జ్ఞాపకం చేసుకుంటాను. నా సమయం సరస్సు ఒడ్డున వాలి, రెక్కల్ని టప టపా విదిల్చి, నా శరీరంలోని కొన్ని ముక్కల్ని పొడిచి నోట కరచుకుని ఎగిరిపోయిన స్త్రీల లేని పాద ముద్రల్ని, నిశ్శబ్దంలో నిశ్శబ్దంతో మళ్ళా పునర్ నిర్మించుకుంటాను. కూసింత తీరిక దొరికినప్పుడు రోడ్డు పక్కగా కూర్చుని దువ్వెనలమ్మే వాళ్ళతో కలసి, ఇంత టీ సిగరెట్ తాగుతాను. అప్పుడప్పుడూ గతాన్నంతా మరచి మళ్ళా స్నేహితుల వద్దకి వెళ్లి గాయపడి వస్తాను.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు నేను రోజుల తరబడి తాగుతూ కూర్చుంటాను. శబ్దం పరిపక్వమైన నిశ్శబ్ధంలా మారేదాకా, నేనే సృష్టించిన మబ్బుల బుడగాలని ముని వేళ్ళతో పగులకొట్టి, వర్షం పరిపూర్ణంగా నా శరీరం అంచులని నిమ్పెదాకా అలా అలలా కదులుతూ కూర్చుంటాను.
నేనొక దేవతని. అప్పుడప్పుడూ నేనొక రాక్షసుడిని. రాతి బండపై పదునుగా సానబెట్టిన కత్తిని అందుకుని, నా రెక్కలోంచి కొంతా నా ఛాతిలోంచీ కొంతా నరుక్కుని ఆహారం వండుకుంటాను. మీరందరూ ఇంతకు మునుపే రుచి చూసిన నా శరీరపు మాంసాన్నే మరోసారి నేను తిని రుచి చూస్తాను. దాహార్తులైన స్త్రీలకు కొద్దిగా రక్తం ఒంపుతాను. సాయంత్రాలు నలుదిక్కులా లేని నక్షత్రాలతో పిగిలిపోతున్నప్పుడు మీరెవరూ చూడని మహా అరణ్యాలలోకి కాంతి వేగంతో పరిగెత్తుకు వెళ్ళిపోతాను. కనిపించని రంగులు. వినిపించని శబ్దాలు. ముఖ్యంగా, పిల్లలు కాళ్ళను టప టపా మని నీళ్ళలోకి మోదుతూ చేతుల్ని చాచి మ్మా మ్మా అంతో రివ్వున రివ్వున ఎగిరిపోయే సమయాలు. యిక నేను
మౌనంగా కూర్చుంటాను. కనిపించని వాటిని వింటాను. వినిపించే వాటన్నిటినీ చూస్తాను. అప్పుడప్పుడూ రోడ్డు పక్కన చెట్టు కింద ఫుట్ పాత్ పై ఇన్ని సామానులు వేసుకుని పంక్చరైన టైర్లు బాగు చేసుకుంటాను. రాత్రి పూట ఇన్ని రొట్టేలని కాల్చుకుని తింటాను. అది కూడా లేనప్పుడు కడుపులోకి ఇన్ని మంచినీళ్ళు కుక్కుకుని పడుకుంటాను. అర్థరాత్రిలో నవ్వుతాను. పగటి పూట మీరందరూ ఇకిలింతలతో మురిసిపోయేలా రోదిస్తాను. యిక
ఈ ధరిత్రి విచ్చుకోవచ్చు. నింగి కుంగి నల్లని జలపాతంలా రాలిపోవచ్చు. వాళ్ళంటారూ, రేపటిని ముందుగా చూసిన వాడెవ్వడూ ఈ పూట ప్రశాంతంగా ఉండలేదు. ఒక ప్రవక్త తన చేతుల్లోని తెల్లటి పావురాన్ని నిమిరి తెల్లని నవ్వుతో మనుషులకు ఇచ్చాడు. ఆ తరువాత మనుషుల చేతులలో తలలు తెగిన వాటి రక్తాన్ని అతడు చూడలేదు. ఇప్పుడు యిక్కడ ఉన్నదేదో ఎప్పటికీ ఉంది. ఉంటూనే ఉంటుంది. గోడపై పాకుతున్న బల్లి పిల్ల. ఆకలికి తాళలేక స్పృహ తప్పిన బిక్షగాడు. రతి సంతృప్తితో లేచి ఉచ్చ పోస్తున్న అరమోడ్పుల కనుల స్త్రీ. రాత్రి పన్నెండింటికి, కూలీకి వెళ్ళిన భర్తకై ఎదురు చూసే భార్య. దూరం నుంచి. తేలే దీపాల్లా దూసుకు వస్తున్న భజన.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
నేనేమీ చేయను. సమయపు నల్లని మట్టిలోంచి మొలకెత్తిన నా ఉనికిని చిరునవ్వుతో బయటకు లాగి, పదాల మధ్య చెమ్మగిల్లుతూ మృదువుగా ఆవిరవుతున్న ఖాళీ స్థలాలను నాతో బాటు చిటికెన వేళ్ళు పట్టుకుని వెళ్ళిపోయే దాకా నేను మీ మధ్య కూర్చుంటాను. రాత్రి మిగిలిన చద్ది అన్నాన్ని మిరపకాయల పచ్చడితో కలుపుకుని తింటాను. కొద్దిగా మిగిలిన, ఎండ వేడిమికి కాగుతున్న నీళ్ళను తాగి, బట్టలన్నీ విప్పి ఆరుబయట కళ్లపై తడిపిన రుమాలుని వేసుకుని నిదురపోతాను. అయ్యల్లారా అమ్మల్లారా, అప్పటిదాకా
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు ఒక బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని వాడు వేసే కేకలన్నిటినీ కాగితంపై రాస్తూ ఉంటాను. ఎవరైనా బిగ్గరగా రోదిస్తూ గుండెలు చరచుకుని వెక్కిళ్ళతో నేలకొరిగిపోతుంటే సంవత్సరాలుగా రాసుకున్న పిల్లల పదాల కేకలని వాళ్ళ ముందు ఉంచుతాను. కొన్నిసార్లు తరగతి గదుల్లో పిల్లలకు పాటాలు చెప్పుకుంటాను. వాళ్లు ఆ పుస్తకాలు చదువుకుని బావుకునే దేమీ లేదని తెలిసీ, అ విషయమే వాళ్లకు మరోసారి చెప్పి, మళ్ళా వచ్చే ఏడాది అవే పాటాలు అప్పజేపుతాను. విసుగొచ్చిన విద్యార్థులకు వినమని గద్దర్ పాటలనూ చదవమని పతంజలి పుస్తకాలనీ ఇస్తుంటాను. భూమి బల్లపరపుగా ఉందని ఒక విద్యార్ధి సంవత్సరం తరువాత కనపడి చెబితే అతడి ముందు నేను చేతులు కట్టుకున్న బాలుడని అవుతాను.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు ఇదిగో ఇటువంటి పదాలను వొంటరిగా కూర్చుని చెక్కుకుంటాను. చెక్కుతున్న ఉలి గురి సరిగ్గా ఉండి దేహంపై గాట్లు పడితే, ఊరుతున్న రక్తాన్ని తుడుచుకుని, మళ్ళా మళ్ళా శిలకు ప్రాణం వచ్చేదాకా నా గొంతుని నరుక్కుంటాను. పగలు సూర్యుడు మేఘాల మధ్యకు అద్రుశ్యమైతే, మరో అంచు నుంచి నేను చంద్రుడిని వెలుపలికి లాగుతాను. రాత్రిపూట చీకటి కటినంగా చుట్టుకున్నప్పుడు ఉదయం దాచిపెట్టుకున్న సూర్యరశ్మిని కట్టెలకు చుట్టి కాగాదాల్లా వెలిగిస్తాను. దారి పొడుగూతా కమిలిన రక్తం పేగుల్లా చెల్లాచెదురై పడి ఉన్న పురుషోత్తం, ఆజంలూ కనిపించి నప్పుడు అరచేతుల మధ్య ఇంత నిప్పుని రాజేసుకుని కనుగుడ్లలో కుక్కుకుంటాను.
కొన్నిసార్లు, మధ్యాహ్నం ఇంట్లోకి మూడు రోజులకొకసారి వచ్చే నీళ్ళని పదిలంగా పట్టుకుంటాను. ఆ తరువాత ఎండ కుబుసం రాలుతున్న వేప చెట్టు కింద నీడల్ని ఆకులకి అంటిస్తూ నా తార తరాల మనుషుల శ్రమను జ్ఞాపకం చేసుకుంటాను. నా సమయం సరస్సు ఒడ్డున వాలి, రెక్కల్ని టప టపా విదిల్చి, నా శరీరంలోని కొన్ని ముక్కల్ని పొడిచి నోట కరచుకుని ఎగిరిపోయిన స్త్రీల లేని పాద ముద్రల్ని, నిశ్శబ్దంలో నిశ్శబ్దంతో మళ్ళా పునర్ నిర్మించుకుంటాను. కూసింత తీరిక దొరికినప్పుడు రోడ్డు పక్కగా కూర్చుని దువ్వెనలమ్మే వాళ్ళతో కలసి, ఇంత టీ సిగరెట్ తాగుతాను. అప్పుడప్పుడూ గతాన్నంతా మరచి మళ్ళా స్నేహితుల వద్దకి వెళ్లి గాయపడి వస్తాను.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
కొన్నిసార్లు నేను రోజుల తరబడి తాగుతూ కూర్చుంటాను. శబ్దం పరిపక్వమైన నిశ్శబ్ధంలా మారేదాకా, నేనే సృష్టించిన మబ్బుల బుడగాలని ముని వేళ్ళతో పగులకొట్టి, వర్షం పరిపూర్ణంగా నా శరీరం అంచులని నిమ్పెదాకా అలా అలలా కదులుతూ కూర్చుంటాను.
నేనొక దేవతని. అప్పుడప్పుడూ నేనొక రాక్షసుడిని. రాతి బండపై పదునుగా సానబెట్టిన కత్తిని అందుకుని, నా రెక్కలోంచి కొంతా నా ఛాతిలోంచీ కొంతా నరుక్కుని ఆహారం వండుకుంటాను. మీరందరూ ఇంతకు మునుపే రుచి చూసిన నా శరీరపు మాంసాన్నే మరోసారి నేను తిని రుచి చూస్తాను. దాహార్తులైన స్త్రీలకు కొద్దిగా రక్తం ఒంపుతాను. సాయంత్రాలు నలుదిక్కులా లేని నక్షత్రాలతో పిగిలిపోతున్నప్పుడు మీరెవరూ చూడని మహా అరణ్యాలలోకి కాంతి వేగంతో పరిగెత్తుకు వెళ్ళిపోతాను. కనిపించని రంగులు. వినిపించని శబ్దాలు. ముఖ్యంగా, పిల్లలు కాళ్ళను టప టపా మని నీళ్ళలోకి మోదుతూ చేతుల్ని చాచి మ్మా మ్మా అంతో రివ్వున రివ్వున ఎగిరిపోయే సమయాలు. యిక నేను
మౌనంగా కూర్చుంటాను. కనిపించని వాటిని వింటాను. వినిపించే వాటన్నిటినీ చూస్తాను. అప్పుడప్పుడూ రోడ్డు పక్కన చెట్టు కింద ఫుట్ పాత్ పై ఇన్ని సామానులు వేసుకుని పంక్చరైన టైర్లు బాగు చేసుకుంటాను. రాత్రి పూట ఇన్ని రొట్టేలని కాల్చుకుని తింటాను. అది కూడా లేనప్పుడు కడుపులోకి ఇన్ని మంచినీళ్ళు కుక్కుకుని పడుకుంటాను. అర్థరాత్రిలో నవ్వుతాను. పగటి పూట మీరందరూ ఇకిలింతలతో మురిసిపోయేలా రోదిస్తాను. యిక
ఈ ధరిత్రి విచ్చుకోవచ్చు. నింగి కుంగి నల్లని జలపాతంలా రాలిపోవచ్చు. వాళ్ళంటారూ, రేపటిని ముందుగా చూసిన వాడెవ్వడూ ఈ పూట ప్రశాంతంగా ఉండలేదు. ఒక ప్రవక్త తన చేతుల్లోని తెల్లటి పావురాన్ని నిమిరి తెల్లని నవ్వుతో మనుషులకు ఇచ్చాడు. ఆ తరువాత మనుషుల చేతులలో తలలు తెగిన వాటి రక్తాన్ని అతడు చూడలేదు. ఇప్పుడు యిక్కడ ఉన్నదేదో ఎప్పటికీ ఉంది. ఉంటూనే ఉంటుంది. గోడపై పాకుతున్న బల్లి పిల్ల. ఆకలికి తాళలేక స్పృహ తప్పిన బిక్షగాడు. రతి సంతృప్తితో లేచి ఉచ్చ పోస్తున్న అరమోడ్పుల కనుల స్త్రీ. రాత్రి పన్నెండింటికి, కూలీకి వెళ్ళిన భర్తకై ఎదురు చూసే భార్య. దూరం నుంచి. తేలే దీపాల్లా దూసుకు వస్తున్న భజన.
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
నేనేమీ చేయను. సమయపు నల్లని మట్టిలోంచి మొలకెత్తిన నా ఉనికిని చిరునవ్వుతో బయటకు లాగి, పదాల మధ్య చెమ్మగిల్లుతూ మృదువుగా ఆవిరవుతున్న ఖాళీ స్థలాలను నాతో బాటు చిటికెన వేళ్ళు పట్టుకుని వెళ్ళిపోయే దాకా నేను మీ మధ్య కూర్చుంటాను. రాత్రి మిగిలిన చద్ది అన్నాన్ని మిరపకాయల పచ్చడితో కలుపుకుని తింటాను. కొద్దిగా మిగిలిన, ఎండ వేడిమికి కాగుతున్న నీళ్ళను తాగి, బట్టలన్నీ విప్పి ఆరుబయట కళ్లపై తడిపిన రుమాలుని వేసుకుని నిదురపోతాను. అయ్యల్లారా అమ్మల్లారా, అప్పటిదాకా
నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.
20 June 2012
నా నాటకం
క్రూర క్రీడా ప్రదర్శన
నీ వాక్య చాతుర్యం -
దానిని నేను
సమూహ సంబంధ
వ్యాపార వర్తకమనే
పిలిచాను
నువ్వొక ఆరితేరిన
కీర్తి కాంక్షకుడవనే
గుర్తించాను. పాపం
ఏం తెలుసు
నిన్ను అల్లుకున్న
వెలిగిన పదాలకు
ఆత్మని గంధంవలె
దేహానికి రాసుకున్న
ఆదిమ శబ్దాలకు
నువ్వొక, రూకల
జాతరవనీ
జాగ్రత్తవనీ?
భళి భళి భళి భళి
బావుంది బలే
విత్తనాలు లేని
కవిత్వ ఫలం -
-సూపర్ మార్కెట్
శీతల గడులలో
అమర్చిన తాజా
పాల పద హారం-
అలా వొలిచి
ఇలా కట్టిన
మొక్కజొన్ను పొత్తుల
తగ్గింపు ధరల
వాచక సౌందర్యం-
పద పద పద యిక
తప్పుకో యిక
నీకెందుకు ఈ
నేలా నీరూ
నింగీ నిప్పూ?
ఒరే, ఒరొరే సమాధులలో
గోడకి వేలాడుతున్నాయి
నిరుటి నీ పుటల శవాలు
ఎవరో వచ్చి
నిన్ను తగలబెట్టేదాకా
నువ్వు ఇంతేనా?
నీ వాక్య చాతుర్యం -
దానిని నేను
సమూహ సంబంధ
వ్యాపార వర్తకమనే
పిలిచాను
నువ్వొక ఆరితేరిన
కీర్తి కాంక్షకుడవనే
గుర్తించాను. పాపం
ఏం తెలుసు
నిన్ను అల్లుకున్న
వెలిగిన పదాలకు
ఆత్మని గంధంవలె
దేహానికి రాసుకున్న
ఆదిమ శబ్దాలకు
నువ్వొక, రూకల
జాతరవనీ
జాగ్రత్తవనీ?
భళి భళి భళి భళి
బావుంది బలే
విత్తనాలు లేని
కవిత్వ ఫలం -
-సూపర్ మార్కెట్
శీతల గడులలో
అమర్చిన తాజా
పాల పద హారం-
అలా వొలిచి
ఇలా కట్టిన
మొక్కజొన్ను పొత్తుల
తగ్గింపు ధరల
వాచక సౌందర్యం-
పద పద పద యిక
తప్పుకో యిక
నీకెందుకు ఈ
నేలా నీరూ
నింగీ నిప్పూ?
ఒరే, ఒరొరే సమాధులలో
గోడకి వేలాడుతున్నాయి
నిరుటి నీ పుటల శవాలు
ఎవరో వచ్చి
నిన్ను తగలబెట్టేదాకా
నువ్వు ఇంతేనా?
నువ్వు లేని మధుశాల
ఆరిపోయిందీ
---ఈ చంద్రనగరి
---ఈ నక్షత్రనగరి
సీసాల్లోంచి
విడుదలైన
నిశి గంధ పుష్ప ఆత్మలు మళ్ళా
సీసాలలోకే
బిరడాలతో
బిగించబడుతున్నాయ్ అలా
ఇలా అల్లల్లా
నువ్ లేక -
ఒరోరే ఒరే
రారోరే రా
రా రా నా
చీలిన ఆత్మపు
రంపపు తపనా
తీరని నా నీ స్త్రీ
గర్భపు కోతా
అనంత కరుణా
మయా వలయా
రా రా రా
పేగుల నిండా
నిప్పు కణికెల్నితాగి
కాల్చిన పేగుల్ని
కాలేయాన్నీ
వాన రొట్టెతో
కాళ్ళ పులుసుతో
తిని చిందేద్దాం-
---ఈ చంద్రనగరి
---ఈ నక్షత్రనగరి
సీసాల్లోంచి
విడుదలైన
నిశి గంధ పుష్ప ఆత్మలు మళ్ళా
సీసాలలోకే
బిరడాలతో
బిగించబడుతున్నాయ్ అలా
ఇలా అల్లల్లా
నువ్ లేక -
ఒరోరే ఒరే
రారోరే రా
రా రా నా
చీలిన ఆత్మపు
రంపపు తపనా
తీరని నా నీ స్త్రీ
గర్భపు కోతా
అనంత కరుణా
మయా వలయా
రా రా రా
పేగుల నిండా
నిప్పు కణికెల్నితాగి
కాల్చిన పేగుల్ని
కాలేయాన్నీ
వాన రొట్టెతో
కాళ్ళ పులుసుతో
తిని చిందేద్దాం-
కొరికే కోరిక
తుమ్ముతూ తుళ్ళిన వీధుల్లోంచి
వెళ్తున్నాను వొంటరిగా
ఒక వాన వానరాన్ని నా
వీపు పై ఎక్కించుకుని
అలా ఆడుకుంటో
అలా పాడుకుంటో
ఇలా ఈ పదాలతో
లోకాన్ని పోపొమ్మని ఎత్తు పళ్ళతో వెక్కిరించుకుంటో
మళ్ళా వస్తున్నాను
నువ్వు తూలిన నీలి
నిప్పుల నింగి సీసాల
విసిగిన హృదయ చెరశాలలలోకే
చేరదీయదా నను నిను
ఈ వింత లోకం కరిగిన
మధుశాలల్లో ఎగురుతో
పోయదా ఈ తోక తొక్కిన సర్పకాలం ఇంత హలాహలం
చాచిన మన గొంతుకలలో
బుసలు కొడుతో
కుబుసం విడుస్తో
అని అనుకుంటో
కొరికే కోరికను
కోరుకుంటో కొరుక్కుంటో
ఇంత గంజాయిని
అలా పీల్చుకుంటో
నీ దరికే వస్తున్నా
బిడ్డా
దారీ తెన్నూ లేక
దుమ్మెతిన దరిద్ర
మహా ద్రిమ్మరినై -
ఉన్నావా నువ్వు
ఇంతకూ యిక్కడ?
వెళ్తున్నాను వొంటరిగా
ఒక వాన వానరాన్ని నా
వీపు పై ఎక్కించుకుని
అలా ఆడుకుంటో
అలా పాడుకుంటో
ఇలా ఈ పదాలతో
లోకాన్ని పోపొమ్మని ఎత్తు పళ్ళతో వెక్కిరించుకుంటో
మళ్ళా వస్తున్నాను
నువ్వు తూలిన నీలి
నిప్పుల నింగి సీసాల
విసిగిన హృదయ చెరశాలలలోకే
చేరదీయదా నను నిను
ఈ వింత లోకం కరిగిన
మధుశాలల్లో ఎగురుతో
పోయదా ఈ తోక తొక్కిన సర్పకాలం ఇంత హలాహలం
చాచిన మన గొంతుకలలో
బుసలు కొడుతో
కుబుసం విడుస్తో
అని అనుకుంటో
కొరికే కోరికను
కోరుకుంటో కొరుక్కుంటో
ఇంత గంజాయిని
అలా పీల్చుకుంటో
నీ దరికే వస్తున్నా
బిడ్డా
దారీ తెన్నూ లేక
దుమ్మెతిన దరిద్ర
మహా ద్రిమ్మరినై -
ఉన్నావా నువ్వు
ఇంతకూ యిక్కడ?
వాస్తవం
తల నిండా నీళ్లోసుకుని
అరచేతుల తువ్వాలుతో
నా ముఖాన్ని తుడుచుకుంటుంటే
చేతివేళ్ళ నిండా నీ ముఖమే అమ్మా
--యిక కళ్ళ నిండా ఎర్రబడ్డ
నువ్వంటిన కుంకుడు రసం
ఉప్పు తిని తిరిగిన కన్నీళ్ళూ
సాంభ్రాణీతో నువ్ అలా
జుత్తుకు పెట్టిన ధూపం
నే హత్తుకున్న నీ దేహం
నీ బొజ్జలో దాచుకున్న
నా బాల్యపు హృదయం
--యిక ఎన్నటికీ
--ఇటు వైపుకి
తలంటిన జామ చెట్ల
తొట్ల కిందకి తిరిగి
రావిక రానే రావు -
అరచేతుల తువ్వాలుతో
నా ముఖాన్ని తుడుచుకుంటుంటే
చేతివేళ్ళ నిండా నీ ముఖమే అమ్మా
--యిక కళ్ళ నిండా ఎర్రబడ్డ
నువ్వంటిన కుంకుడు రసం
ఉప్పు తిని తిరిగిన కన్నీళ్ళూ
సాంభ్రాణీతో నువ్ అలా
జుత్తుకు పెట్టిన ధూపం
నే హత్తుకున్న నీ దేహం
నీ బొజ్జలో దాచుకున్న
నా బాల్యపు హృదయం
--యిక ఎన్నటికీ
--ఇటు వైపుకి
తలంటిన జామ చెట్ల
తొట్ల కిందకి తిరిగి
రావిక రానే రావు -
19 June 2012
ఏమిటిది?
ఏక పత్రమైన కాంతిని
తాగుతున్నాను
పరమ పవిత్రంగా
ఏక పతీవ్రతుడైన తనువుతో, తనువంత తన అంత పాత్రతో
--నిరంతరం
హాలాహలం
నీ నాభిపై చెవిని ఆన్చి విన్న
నీ లోపలి నేనైన
నీ పసి నెత్తురైన
మందార పూల
శిశు కదలికలతో
నా చెవిలో వీచిన
నీ పలికీ పలుకని
పెదాల రహస్యంతో-
హతవిధీ, ఒక
-హృదయాన్ని
తొలి వానలో దున్ని
నాటుతున్నారు
మట్టివేళ్ళతో ఒక
రూపాన్ని ఎవరో వొంగిన నడుముతో, చూరైన కనులతో
నుదిటి తడిని తుడుచుకునే గాలి వంటి ముంజేతులతో-
ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంతకూ
విత్తనం మెత్తగా
మట్టిలోకి ఇంకే మైమరపు కాలాన?
తాగుతున్నాను
పరమ పవిత్రంగా
ఏక పతీవ్రతుడైన తనువుతో, తనువంత తన అంత పాత్రతో
--నిరంతరం
హాలాహలం
నీ నాభిపై చెవిని ఆన్చి విన్న
నీ లోపలి నేనైన
నీ పసి నెత్తురైన
మందార పూల
శిశు కదలికలతో
నా చెవిలో వీచిన
నీ పలికీ పలుకని
పెదాల రహస్యంతో-
హతవిధీ, ఒక
-హృదయాన్ని
తొలి వానలో దున్ని
నాటుతున్నారు
మట్టివేళ్ళతో ఒక
రూపాన్ని ఎవరో వొంగిన నడుముతో, చూరైన కనులతో
నుదిటి తడిని తుడుచుకునే గాలి వంటి ముంజేతులతో-
ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంతకూ
విత్తనం మెత్తగా
మట్టిలోకి ఇంకే మైమరపు కాలాన?
జ్ఞాని
ఒక తిరుగుబోతు పదం
నీ దగ్గర ఉంటే చెప్పు
వింటానొరే, తల ఒగ్గి
నువ్వు ఉన్నన్నాళ్ళూ
బాంచెన్ అంటూ ఎందుకు
భాష ముందు
ఎంగిలిపడటం?
--తిరిగి తిరిగి వలయమైన
తోక చుట్టూ తిరుగుతుంది
మనసొకటి ఏమీ చేయలేక
చూపులపై పొట్టు పోలేకా
ఎక్కడా మొలకెత్త లేకా
అరుస్తుంది నీ హృదయం
ఒక పిల్ల కాకై నీ
శభ్దాల ముందు-
కంగారు పడకు - పడకు
నీ భాష నీకున్నూ
ఎప్పుడూ ఆ అతిధే
వస్తుందో రాదో మరి
తన భాష నీకు
నీ భాష తనకు
విను వినా విను
కను కను తనను
నీ ఇంటిలోకి నిను
మరి తను ప్రేమగా
ఆహ్వానిస్తుందో
లేదో మరా చింకి గీతల
పాల కంకుల పలకల
చిన్ని పాపకీ తెలియదు-
ఒరే నాయనా
సంపర్క జ్ఞానీ
నిన్న నీ చీకట్లో ఒక కోడి కూచింది
ఇక వెళ్దామా అలా
లేచిపోయి మనం
మనం దోచుకున్న
మనం లేని మన
పూర్వీకుల
పూరిళ్ళకి-?
నీ దగ్గర ఉంటే చెప్పు
వింటానొరే, తల ఒగ్గి
నువ్వు ఉన్నన్నాళ్ళూ
బాంచెన్ అంటూ ఎందుకు
భాష ముందు
ఎంగిలిపడటం?
--తిరిగి తిరిగి వలయమైన
తోక చుట్టూ తిరుగుతుంది
మనసొకటి ఏమీ చేయలేక
చూపులపై పొట్టు పోలేకా
ఎక్కడా మొలకెత్త లేకా
అరుస్తుంది నీ హృదయం
ఒక పిల్ల కాకై నీ
శభ్దాల ముందు-
కంగారు పడకు - పడకు
నీ భాష నీకున్నూ
ఎప్పుడూ ఆ అతిధే
వస్తుందో రాదో మరి
తన భాష నీకు
నీ భాష తనకు
విను వినా విను
కను కను తనను
నీ ఇంటిలోకి నిను
మరి తను ప్రేమగా
ఆహ్వానిస్తుందో
లేదో మరా చింకి గీతల
పాల కంకుల పలకల
చిన్ని పాపకీ తెలియదు-
ఒరే నాయనా
సంపర్క జ్ఞానీ
నిన్న నీ చీకట్లో ఒక కోడి కూచింది
ఇక వెళ్దామా అలా
లేచిపోయి మనం
మనం దోచుకున్న
మనం లేని మన
పూర్వీకుల
పూరిళ్ళకి-?
18 June 2012
ఆశ్చర్యం
రాత్రుళ్ళు ఇంటికి
నే ఆలస్యంగా వస్తే
తలుపుల ముంగిట వెలిగే దీపం నువ్వని
అదే అనుకున్నాము
నేనూ నా ప్రపంచమూ
---ఇంత కాలమూ---
చూడు ఈ వేళ
అలా వర్షం ఆగి
నేను తల ఎత్తి మహా ధీమాగా నిర్లక్ష్యంగా
నువ్వు లేని చెట్ల కింద వెచ్చగా
నే నడుచుకుంటూ వెడుతుంటే
ఒక గాలి వీచి, చెట్లు ఊగి
నా వొళ్ళంతా వానయ్యింది
ఒక మెత్తటి వణుకయ్యింది
నా చేతులు యిక
నన్ను మాత్రమే
అల్లుకోగలిగే ఒక ఒంటరి సాయంత్రపు కౌగిలి అయ్యింది-
అలా ఎలా వెళ్ళిపోయావు
ఆ వర్షాన్ని వెంటబెట్టుకుని
ఆకుల్లో నీ చూపుల చినుకులని మాత్రం మిగిల్చి?
నే ఆలస్యంగా వస్తే
తలుపుల ముంగిట వెలిగే దీపం నువ్వని
అదే అనుకున్నాము
నేనూ నా ప్రపంచమూ
---ఇంత కాలమూ---
చూడు ఈ వేళ
అలా వర్షం ఆగి
నేను తల ఎత్తి మహా ధీమాగా నిర్లక్ష్యంగా
నువ్వు లేని చెట్ల కింద వెచ్చగా
నే నడుచుకుంటూ వెడుతుంటే
ఒక గాలి వీచి, చెట్లు ఊగి
నా వొళ్ళంతా వానయ్యింది
ఒక మెత్తటి వణుకయ్యింది
నా చేతులు యిక
నన్ను మాత్రమే
అల్లుకోగలిగే ఒక ఒంటరి సాయంత్రపు కౌగిలి అయ్యింది-
అలా ఎలా వెళ్ళిపోయావు
ఆ వర్షాన్ని వెంటబెట్టుకుని
ఆకుల్లో నీ చూపుల చినుకులని మాత్రం మిగిల్చి?
దా, దా
ముసురు పట్టిన పగలు
ఒళ్లంతా కరి మబ్బులు
నీ చేతి వేళ్ళ అంచులలో బద్ధకంగా తన చేతి నిప్పులు-
యిక
ఆ దారి పొడుగూతా
తిరుగుతాయి మరి
రాత్రి కురిసిన
ఆ వాన నీళ్ళు
మత్తుగా - బరువుగా
నీ చెంపలని తాకే ఈ
నీడల అలికిడి గాలితో-
అదే నేను చెప్పేది
దారి పొడుగూతా
నీ జుత్తుని చెరిపే
ఆ చల్లటి తడిని విదుల్చుకునేందుకు
నువ్వు వెళ్ళే
మధుశాలల
మనోహర కుంపట్ల గురించి
నీ వెనుకే గెంతుతూ సాగే
నువ్వు ఏమీ చేయలేని
ఆ అల్లరి వాన పిల్ల గురించి- :-)
దా దా తాగుదాం
తాగుదాం యిక
మనం - మనం
మనల్ని మనం
నువ్వు నన్నూ
నిన్ను నేనూ-
ఒళ్లంతా కరి మబ్బులు
నీ చేతి వేళ్ళ అంచులలో బద్ధకంగా తన చేతి నిప్పులు-
యిక
ఆ దారి పొడుగూతా
తిరుగుతాయి మరి
రాత్రి కురిసిన
ఆ వాన నీళ్ళు
మత్తుగా - బరువుగా
నీ చెంపలని తాకే ఈ
నీడల అలికిడి గాలితో-
అదే నేను చెప్పేది
దారి పొడుగూతా
నీ జుత్తుని చెరిపే
ఆ చల్లటి తడిని విదుల్చుకునేందుకు
నువ్వు వెళ్ళే
మధుశాలల
మనోహర కుంపట్ల గురించి
నీ వెనుకే గెంతుతూ సాగే
నువ్వు ఏమీ చేయలేని
ఆ అల్లరి వాన పిల్ల గురించి- :-)
దా దా తాగుదాం
తాగుదాం యిక
మనం - మనం
మనల్ని మనం
నువ్వు నన్నూ
నిన్ను నేనూ-
17 June 2012
ఇవాళ
ఏం చేసావ్ ఇవాళంతా-?
నీతో వర్షాన్ని వింటూ
నీలో నిదురపోయాను
యిక చూడు చూడు
మేల్కొని నువ్వు
రాత్రి కల నిండా
విసిరే వేప చెట్లు
ఎగిరే ఆకులు, రాలే పూవులు
మన ఒళ్లంతా తడిమే
ఆ చినుకుల
పచ్చి వాసన-
నీతో వర్షాన్ని వింటూ
నీలో నిదురపోయాను
యిక చూడు చూడు
మేల్కొని నువ్వు
రాత్రి కల నిండా
విసిరే వేప చెట్లు
ఎగిరే ఆకులు, రాలే పూవులు
మన ఒళ్లంతా తడిమే
ఆ చినుకుల
పచ్చి వాసన-
16 June 2012
రామ్లెట్
ఆనాడు వేసావు నువ్వొక ఆమ్లెట్
రాముడు మంచి బాలుడు కదాని
మనం మధువుని
ఆకాశపు పాత్రలతో
రాత్రిలో తడిచిన గాలితో తాగినప్పుడు-
కానీ లోకం ఒక సర్పం
అందుకే అది ఇచ్చింది
నీ అమాయకత్వపు హృదయ కాలాలలోకి
ఒక గాయం
చిమ్మింది నీ తెల్లని కనులలోకి
ఒక శోకం
ఒక శాపం-
రామ రామ రామా
ఉన్నావా ఎక్కడైనా
యింకా
రాత్రంతా మనం గడిపిన
ఆ అమృత కాలాల
ఇకిలి నవ్వులలో-?
___________________
రాము వేసిన ఆమ్లెట్ = రామ్లేట్
రాముడు మంచి బాలుడు కదాని
మనం మధువుని
ఆకాశపు పాత్రలతో
రాత్రిలో తడిచిన గాలితో తాగినప్పుడు-
కానీ లోకం ఒక సర్పం
అందుకే అది ఇచ్చింది
నీ అమాయకత్వపు హృదయ కాలాలలోకి
ఒక గాయం
చిమ్మింది నీ తెల్లని కనులలోకి
ఒక శోకం
ఒక శాపం-
రామ రామ రామా
ఉన్నావా ఎక్కడైనా
యింకా
రాత్రంతా మనం గడిపిన
ఆ అమృత కాలాల
ఇకిలి నవ్వులలో-?
___________________
రాము వేసిన ఆమ్లెట్ = రామ్లేట్
ఎలా?
మట్టి కుండలో
చక్కగా చల్లగా
ఒదిగి ఒదిగి కూర్చున్నాం నేనూ నా ప్రపంచం-
కానీ
ఎలా
తెలియలేదు
ఇంత కాలం
ఆ మట్టి కుండా
గొంతు తడిపిన
ఆ మంచినీళ్ళూ
నీవే ననీ- ?
చక్కగా చల్లగా
ఒదిగి ఒదిగి కూర్చున్నాం నేనూ నా ప్రపంచం-
కానీ
ఎలా
తెలియలేదు
ఇంత కాలం
ఆ మట్టి కుండా
గొంతు తడిపిన
ఆ మంచినీళ్ళూ
నీవే ననీ- ?
చినుకుల చిందులు
తొలి పలుకు పలుకబోయే
ఆ పసి పసి పెదాలపై
ఒక తేనె చినుకు వాలి
ఒక వాన చినుకు రాలి
నీ తనువంతా
అల్లుకుపోయి
విశ్వవ్యాప్తమై
ఓంకారనాదమై
ప్రేమించి
నిన్ను గాట్టిగా
కావలించుకుని
పీల్చి పిప్పి చేసి వొదలగా
తిరిగి
ఆ చినుకుల
చిందులలోకి
నువ్వే, నవ్వే
ఆ చావు చూరు
కింది కూర్చుని
నీ తనువు పాత్రలో
నీ తనువు పాత్రతో
మధువు తాగుతూ
ఆ పసి పసి పెదాలపై
ఒక తేనె చినుకు వాలి
ఒక వాన చినుకు రాలి
నీ తనువంతా
అల్లుకుపోయి
విశ్వవ్యాప్తమై
ఓంకారనాదమై
ప్రేమించి
నిన్ను గాట్టిగా
కావలించుకుని
పీల్చి పిప్పి చేసి వొదలగా
తిరిగి
ఆ చినుకుల
చిందులలోకి
నువ్వే, నవ్వే
ఆ చావు చూరు
కింది కూర్చుని
నీ తనువు పాత్రలో
నీ తనువు పాత్రతో
మధువు తాగుతూ
యిక
నువ్వే ఈ చినుకుల
-రాహిత్యపు
మధుశాలలో-
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
గా
గా
గా
...
-రాహిత్యపు
మధుశాలలో-
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరిగా
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
వొంటరి
గా
గా
గా
...
మబ్బుల కోరిక
- తెల్లగా, చల్లగా
మబ్బులు ఆడే
పసిడి కాంతిగా
పసిపూలు వీచే
పచ్చని గాలిగా
మరి ఈ ఉదయం
ఇలా ఉంటె మరి
నీ హృదయం ఏమంటుంది?
మబ్బులు ఆడే
పసిడి కాంతిగా
పసిపూలు వీచే
పచ్చని గాలిగా
మరి ఈ ఉదయం
ఇలా ఉంటె మరి
నీ హృదయం ఏమంటుంది?
అవివేకం
భూమిని వొదిలిన
నీవైన పూరేణువు
తిరిగి చేరుతుంది
-జాబిలిని రాత్రిలో-
నీకు ముందూ
--నీకు వెనుకా
సూర్య శ్వాసా
సూర్య ధూళీ
నిను వెంటాడే సూర్య నేత్రం సూర్య కాలం లోకం--
చింతించకు
----వస్తారు వాళ్లు
వాళ్ళే వెళ్లిపోయిన
వాళ్ళే తిరిగి-----
రేణువై వేణువై
మొక్కై పూవై పిట్టై
పురుగై వానై పిల్లలై-
చింతించకు
-ఎవరిదో హృదయం
మార్మోగక తప్పదు
నీలో
నీ చివరి క్షణం దాకా-
యిక
యింకా రాయటం
కొనసాగించడం
-ఎంత అవివేకం!
నీవైన పూరేణువు
తిరిగి చేరుతుంది
-జాబిలిని రాత్రిలో-
నీకు ముందూ
--నీకు వెనుకా
సూర్య శ్వాసా
సూర్య ధూళీ
నిను వెంటాడే సూర్య నేత్రం సూర్య కాలం లోకం--
చింతించకు
----వస్తారు వాళ్లు
వాళ్ళే వెళ్లిపోయిన
వాళ్ళే తిరిగి-----
రేణువై వేణువై
మొక్కై పూవై పిట్టై
పురుగై వానై పిల్లలై-
చింతించకు
-ఎవరిదో హృదయం
మార్మోగక తప్పదు
నీలో
నీ చివరి క్షణం దాకా-
యిక
యింకా రాయటం
కొనసాగించడం
-ఎంత అవివేకం!
15 June 2012
నేను చేసినది
"చాలు చాలిక ఆపు
యిక ఇంటికి వెళ్ళు"
అన్నాడు అతను -
మరి నేనేం చేసాను?
త్వరితగతిన
నేనా మధుశాలని వొదిలి
మరొక మధుశాలలో చేరి
నూతనంగా
ఆనందంగా
యవ్వనంతో
వికసించిన నూనుగు పెదాలతో
తాజాగా ఈ పదాలను రాసాను -
'రేలా, రే ఎవరక్కడ? ఏదీ
నా ఈ దినపు దివ్యమైన
మధువూ
ఆ నా అమృత అస్తిత్వపు
మధువు, తొలికిన నిండు
పసిడి పాత్రా తనగవూ*?'
________________________
తను+నగవు మరియు తనువు + నగవు
యిక ఇంటికి వెళ్ళు"
అన్నాడు అతను -
మరి నేనేం చేసాను?
త్వరితగతిన
నేనా మధుశాలని వొదిలి
మరొక మధుశాలలో చేరి
నూతనంగా
ఆనందంగా
యవ్వనంతో
వికసించిన నూనుగు పెదాలతో
తాజాగా ఈ పదాలను రాసాను -
'రేలా, రే ఎవరక్కడ? ఏదీ
నా ఈ దినపు దివ్యమైన
మధువూ
ఆ నా అమృత అస్తిత్వపు
మధువు, తొలికిన నిండు
పసిడి పాత్రా తనగవూ*?'
________________________
తను+నగవు మరియు తనువు + నగవు
14 June 2012
protocol
గీత దాటని సీతా లేదు
పసిడి లేడిని వేటాడని
తండ్రి మాట జవదాటిన రాముడూ లేదు
హృదయ నాసికను కోల్పోని
శూర్పణఖ యికనీ
కెన్నటికీ కానరాదు-
ఇంతకూ
- లేచిందా ఊర్మిళ
నిద్దుర ఈనాటికైనా?
పసిడి లేడిని వేటాడని
తండ్రి మాట జవదాటిన రాముడూ లేదు
హృదయ నాసికను కోల్పోని
శూర్పణఖ యికనీ
కెన్నటికీ కానరాదు-
ఇంతకూ
- లేచిందా ఊర్మిళ
నిద్దుర ఈనాటికైనా?
ఏయ్ పిల్లా
ఏయ్ పిల్లా
చీకట్లో పూసిన పువ్వుని
అమావాస్య నాడైనా నీకై
కోసుకు రాగలను కానీ, కానీ
రగిలిపోతున్న జాబిలిలో
దాగి ఉన్న నల్లని రాత్రిని యిప్పటికిప్పుడు తెమ్మంటే
ఎలా పిల్లా - ఎల్లా ఎల్లెల్లా?
చీకట్లో పూసిన పువ్వుని
అమావాస్య నాడైనా నీకై
కోసుకు రాగలను కానీ, కానీ
రగిలిపోతున్న జాబిలిలో
దాగి ఉన్న నల్లని రాత్రిని యిప్పటికిప్పుడు తెమ్మంటే
ఎలా పిల్లా - ఎల్లా ఎల్లెల్లా?
హృదయ నిశ్శబ్ధం
నాన్నా, నవ్వుతూ వెళ్ళమని నువ్వూ
నవ్వుతూ రమ్మని టీచరూ అంటుంది
కానీ, నవ్వడం ఎలాగా నాన్నా - అని
నీటి బుడగలు పగిలే
ఈ ఉదయపు వేళల్లో
కళ్ళల్లో తుంపర కురిసే ఆ సమయాల్లో
గుండె ఉగ్గబట్టుకుని, చేతులతో
నన్ను గట్టిగా బిగించి పట్టుకుని
అడిగాడు ఆ ఆరేళ్ళ పిల్లవాడు
జ్ఞానం ఉబ్బిన బాగ్ బరువుతో
వొంగి, వడలి
ఆటలు లేని
విష కాలంగా
రెప్పపాటులో
అయిపోతున్న
దినంగా మారి
ఏడిచే పెదాలపై
పగిలే నవ్వును
బలవంతంగా లాగుతూ
-అడిగాడు ఆ పిల్లవాడు
'ఇలానేనా?' అని
చెట్లు వీచి
ధూళి రేగి
శరీరం నిశ్శబ్ధం నిస్సహాయతా అయ్యే
కాలాలలో-
ఇంతకూ
నవ్వడం
ఇలాగేనా?
నవ్వుతూ రమ్మని టీచరూ అంటుంది
కానీ, నవ్వడం ఎలాగా నాన్నా - అని
నీటి బుడగలు పగిలే
ఈ ఉదయపు వేళల్లో
కళ్ళల్లో తుంపర కురిసే ఆ సమయాల్లో
గుండె ఉగ్గబట్టుకుని, చేతులతో
నన్ను గట్టిగా బిగించి పట్టుకుని
అడిగాడు ఆ ఆరేళ్ళ పిల్లవాడు
జ్ఞానం ఉబ్బిన బాగ్ బరువుతో
వొంగి, వడలి
ఆటలు లేని
విష కాలంగా
రెప్పపాటులో
అయిపోతున్న
దినంగా మారి
ఏడిచే పెదాలపై
పగిలే నవ్వును
బలవంతంగా లాగుతూ
-అడిగాడు ఆ పిల్లవాడు
'ఇలానేనా?' అని
చెట్లు వీచి
ధూళి రేగి
శరీరం నిశ్శబ్ధం నిస్సహాయతా అయ్యే
కాలాలలో-
ఇంతకూ
నవ్వడం
ఇలాగేనా?
13 June 2012
అతను ఆ రాత్రి
వంకీలు తిరిగిన
పాత్రల కనులతో
శరీరం నిండా తనని పులుముకుని
తన నామాన్ని
గంజాయి వలె
గుండెల నిండా పీల్చుకుని, గొంతు
దిగబోయే నిప్ప్పుల మధువును
పుక్కిట పట్టి, తూలుతో పాడుతో
కుడి చేత చేపముక్కతో
ఎడమ చేత పొగాకు తో
అతను- అతనే తటిల్లున
మధుపాత్ర అంచు నుంచి
జాబిలిని మింగిన ఆ రాత్రి
రాతి అలల సరస్సులోకి
మరో ఆలోచన లేకుండా
దుమికాడు-
అతను విస్మరించినదేహీ
దేహం తేలింది ఎక్కడ-?
పాత్రల కనులతో
శరీరం నిండా తనని పులుముకుని
తన నామాన్ని
గంజాయి వలె
గుండెల నిండా పీల్చుకుని, గొంతు
దిగబోయే నిప్ప్పుల మధువును
పుక్కిట పట్టి, తూలుతో పాడుతో
కుడి చేత చేపముక్కతో
ఎడమ చేత పొగాకు తో
అతను- అతనే తటిల్లున
మధుపాత్ర అంచు నుంచి
జాబిలిని మింగిన ఆ రాత్రి
రాతి అలల సరస్సులోకి
మరో ఆలోచన లేకుండా
దుమికాడు-
అతను విస్మరించినదేహీ
దేహం తేలింది ఎక్కడ-?
వ్యాఖ్యానం
ఎటువంటి దినం యిది!
సత్తు బిళ్ళలా నైనా
ఎవరూ నిన్ను కనీసం ఆ అంధ భిక్షకుని
ఆకాశపు చిల్లు గిన్నెలో
విసిరి వేసైనా వెళ్ళలేదు-
యిక యిదే సరైన సమయం
నీలోంచి నువ్వు జారి
చేతివేళ్ళతో రాత్రిళ్ళతో
మరొకరి అరచేతుల్లోకి
మృత్యు పిలుపువై ఎగిరిపోయేందుకు-
సత్తు బిళ్ళలా నైనా
ఎవరూ నిన్ను కనీసం ఆ అంధ భిక్షకుని
ఆకాశపు చిల్లు గిన్నెలో
విసిరి వేసైనా వెళ్ళలేదు-
యిక యిదే సరైన సమయం
నీలోంచి నువ్వు జారి
చేతివేళ్ళతో రాత్రిళ్ళతో
మరొకరి అరచేతుల్లోకి
మృత్యు పిలుపువై ఎగిరిపోయేందుకు-
12 June 2012
† కన్నీళ్లు
( )
...
...
...
...
...
...
...
...
...
( )
గుండెలో ముఖం దాచుకుని
నను గాట్టిగా కావలించుకుని
'నన్నలా వొదిలిపోకూ' అంటూ
వెక్కిళ్ళతో బేలకళ్ళతో
కన్నీళ్ళతో, పెదాలతో
నువ్వు అంటించిన
ఆ దేహమే భస్మమై
ఆ నిశి రాత్రి నలుదిశలా
చెదిరిపోయి, ఉదయపు
మంచులో
ఆ పై చిహ్నంగా
-ఎదురైయ్యింది-
(-ఎక్కడ, ఏ నీ శరీరపు
- వి/స్మృతి మలుపులో
మరణించెను ప్రభువు?)
...
...
...
...
...
...
...
...
...
( )
†
గుండెలో ముఖం దాచుకుని
నను గాట్టిగా కావలించుకుని
'నన్నలా వొదిలిపోకూ' అంటూ
వెక్కిళ్ళతో బేలకళ్ళతో
కన్నీళ్ళతో, పెదాలతో
నువ్వు అంటించిన
ఆ దేహమే భస్మమై
ఆ నిశి రాత్రి నలుదిశలా
చెదిరిపోయి, ఉదయపు
మంచులో
ఆ పై చిహ్నంగా
-ఎదురైయ్యింది-
(-ఎక్కడ, ఏ నీ శరీరపు
- వి/స్మృతి మలుపులో
మరణించెను ప్రభువు?)
11 June 2012
ఒక క్షణం
అరచేతులు ముకుళించి
నుదిటిన ఆన్చుకుని
నీ తలను వంచుకుని
అలా నిస్సహాయంగా
గాలికి తేలే తుంపరై కూర్చుంటావు
ఆ కొన్ని దినాలలో
ఒక్క మాట కోసం
ఒక తేలికైన భయం లేని స్పర్శ కోసం-
గదిలో తనువు ఉందో
తనువులో గది ఉందో
తెలియదు నీకు ఆ మాగన్నుగా తూలిన క్షణాలలో:
తెరిచిన కిటికీలోంచి
ఎప్పటిదో ఒక ఎండ
నేలంతా కదులుతూ
పొడుచుకు తింటుంది రాలిన నీడలనీ
పొడి పొడిగా మొలకెత్తుతున్న గాలినీ
తెరిచిన తలుపులోంచి
ఎవరిదో ఒక చేయి సాగి
వెనుక నుంచి భుజంపై
రహస్యంగా ఒత్తుతుంది ఒక ఓదార్పు ఒత్తిడిని
అంతా అద్రుశ్య సంగీతమే
అంతా అంతులేని/పట్టని
ఒక జీవన మృత్యు మోహిత సంరంభమే
నా చెంపని తాకే చేతులు
అవి నీ కళ్ళలోని కన్నీళ్లు
ఆగిపోయిన నీ పెదాలూ
కమిలి, మంచంలో అలా
ముడుచుకుపోయిన నీ అలలాంకృత తనువూ
నేను వినలేకపోయిన
నీ మూగ కథనాలు -
వికసించిన గులాబీని
తాకుదామని కదిలిన
ఆ వేలి చివరన నిలిచింది
ఒక నల్లని నెత్తురు బొట్టు
నృత్యం చేద్దామని దూకిన
అరి పాదాలలో పొసగింది
ఆ మంచు దిగంతాల ఒక
మహా అస్తిత్వపు వొణుకు
దీనిని జీవితమనాలో లేక
ఒక శాపరత్నాకరమనాలో
ఏమనాలో, నా పేరుగా మారుతూ
అరచేతులు ముకుళించి
నిశ్శబ్ధంగా ఆరిపోతున్న
--అతనికి నువ్వే చెప్పు--
నుదిటిన ఆన్చుకుని
నీ తలను వంచుకుని
అలా నిస్సహాయంగా
గాలికి తేలే తుంపరై కూర్చుంటావు
ఆ కొన్ని దినాలలో
ఒక్క మాట కోసం
ఒక తేలికైన భయం లేని స్పర్శ కోసం-
గదిలో తనువు ఉందో
తనువులో గది ఉందో
తెలియదు నీకు ఆ మాగన్నుగా తూలిన క్షణాలలో:
తెరిచిన కిటికీలోంచి
ఎప్పటిదో ఒక ఎండ
నేలంతా కదులుతూ
పొడుచుకు తింటుంది రాలిన నీడలనీ
పొడి పొడిగా మొలకెత్తుతున్న గాలినీ
తెరిచిన తలుపులోంచి
ఎవరిదో ఒక చేయి సాగి
వెనుక నుంచి భుజంపై
రహస్యంగా ఒత్తుతుంది ఒక ఓదార్పు ఒత్తిడిని
అంతా అద్రుశ్య సంగీతమే
అంతా అంతులేని/పట్టని
ఒక జీవన మృత్యు మోహిత సంరంభమే
నా చెంపని తాకే చేతులు
అవి నీ కళ్ళలోని కన్నీళ్లు
ఆగిపోయిన నీ పెదాలూ
కమిలి, మంచంలో అలా
ముడుచుకుపోయిన నీ అలలాంకృత తనువూ
నేను వినలేకపోయిన
నీ మూగ కథనాలు -
వికసించిన గులాబీని
తాకుదామని కదిలిన
ఆ వేలి చివరన నిలిచింది
ఒక నల్లని నెత్తురు బొట్టు
నృత్యం చేద్దామని దూకిన
అరి పాదాలలో పొసగింది
ఆ మంచు దిగంతాల ఒక
మహా అస్తిత్వపు వొణుకు
దీనిని జీవితమనాలో లేక
ఒక శాపరత్నాకరమనాలో
ఏమనాలో, నా పేరుగా మారుతూ
అరచేతులు ముకుళించి
నిశ్శబ్ధంగా ఆరిపోతున్న
--అతనికి నువ్వే చెప్పు--
స్నానం
తొలిసారిగా ఈ రోజు
వర్షంలో
వర్షంతో
నా తనువు స్నానం చేసింది
యిక
నీ అరచేతుల పొగలో
నీ శరీరపు సాంభ్రాణీ
ముఖమల్ అత్తరు తువ్వాలుతో
నన్ను నేను అలా
తుడుచుకోవడమే
మిగిలి ఉంది-మరి
ఏమంటావు నువ్వు?
వర్షంలో
వర్షంతో
నా తనువు స్నానం చేసింది
యిక
నీ అరచేతుల పొగలో
నీ శరీరపు సాంభ్రాణీ
ముఖమల్ అత్తరు తువ్వాలుతో
నన్ను నేను అలా
తుడుచుకోవడమే
మిగిలి ఉంది-మరి
ఏమంటావు నువ్వు?
స్కూళ్ళు మొదలయ్యిన దినం
రాత్రి ఆద్ధంలోంచి తప్పుకుని చందమామ
తనపై కమ్ముకున్న ఆ మబ్బుల మాటున
తనపై కమ్ముకున్న ఆ మబ్బుల మాటున
దిగులుగా ఎక్కడో వేచి ఉంది: నిదుర లేకా
బయటకు కనిపించలేకా ఎవరికీ చెప్పుకోలేకా-
యిక తెల్లవారుఝామున లేచిన
ఉదయంలో, పిల్లల హృదయంలో
ఒకటే బెంగ, ఒకటే
ఎడతెరపని వాన -
యిక ఈ దినం
-ఎంతమంది తల్లులూ
ఎంతమంది తండ్రులూ
ఎన్ని పసి కనులూ
ఎన్ని లేత దేహాలూ
-నిశి ముసురు కమ్ముకుని
చిత్తడి చిత్తడిగా మారతాయో
నీకేమైనా తెలుసా?
బయటకు కనిపించలేకా ఎవరికీ చెప్పుకోలేకా-
యిక తెల్లవారుఝామున లేచిన
ఉదయంలో, పిల్లల హృదయంలో
ఒకటే బెంగ, ఒకటే
ఎడతెరపని వాన -
యిక ఈ దినం
-ఎంతమంది తల్లులూ
ఎంతమంది తండ్రులూ
ఎన్ని పసి కనులూ
ఎన్ని లేత దేహాలూ
-నిశి ముసురు కమ్ముకుని
చిత్తడి చిత్తడిగా మారతాయో
నీకేమైనా తెలుసా?
10 June 2012
ఆగమనం
నిండైన ఒద్దికతో ఓపికగా
ఎక్కడి నుంచో
తన రెక్కల్లో దాచుకుని తెచ్చుకున్న
ఓ నీటి విత్తుని
యిక్కడ ప్రేమగా నాటింది
తనతో తానే విసిగిపోయిన
ఈ వేసవి పిట్ట-
యిక రాత్రి బాటలో
అలసి కూలిపోయిన
నీ దాహపు దేహం
ఈ ఉదయాని కల్లా
చినుకుల పూలు
జల్లై రాలుతున్న
ఆ నీటిచెట్టు కింద
నీ ఆత్మ తడిచిన
మట్టి చల్లదనంతో
హాయిగా నిదుర లేచింది-
ఎక్కడి నుంచో
తన రెక్కల్లో దాచుకుని తెచ్చుకున్న
ఓ నీటి విత్తుని
యిక్కడ ప్రేమగా నాటింది
తనతో తానే విసిగిపోయిన
ఈ వేసవి పిట్ట-
యిక రాత్రి బాటలో
అలసి కూలిపోయిన
నీ దాహపు దేహం
ఈ ఉదయాని కల్లా
చినుకుల పూలు
జల్లై రాలుతున్న
ఆ నీటిచెట్టు కింద
నీ ఆత్మ తడిచిన
మట్టి చల్లదనంతో
హాయిగా నిదుర లేచింది-
09 June 2012
అతను చెప్పిన అతని సత్యం
మెలికలు తిరిగిన ఈ
మనుషులు కన్నా
బుస కొట్టే త్రాచులు
నవ్వులతో కదిలే మీ ముఖాలు కన్నా
ఆ మేలిమి ముసుగులు
ముచ్చటగా వేసుకున్న
మీ పా/మాటలు కన్నా
నిండుగా
తేలికగా
హాయిగా
పసిడి కాంతితో
విశ్వమోహంతో
నాతో సదా వెన్నంటే ఉండే
ఆ పవిత్ర వర్షం కురిసిన
వనాల వెన్నెలపై మెరిసే
సూర్యరశ్మి లాంటి ఈ నా
మధుపాత్రే నాకు మిన్న-
మనుషులు కన్నా
బుస కొట్టే త్రాచులు
నవ్వులతో కదిలే మీ ముఖాలు కన్నా
ఆ మేలిమి ముసుగులు
ముచ్చటగా వేసుకున్న
మీ పా/మాటలు కన్నా
నిండుగా
తేలికగా
హాయిగా
పసిడి కాంతితో
విశ్వమోహంతో
నాతో సదా వెన్నంటే ఉండే
ఆ పవిత్ర వర్షం కురిసిన
వనాల వెన్నెలపై మెరిసే
సూర్యరశ్మి లాంటి ఈ నా
మధుపాత్రే నాకు మిన్న-
రహస్యం
జ్వలించే చీకటి అంటిన
నీడలు ముసిరిన
నీ నల్లని కనులతో
ఈ వేకువలోకి
వచ్చాను నేను
ఇక నీకు తెలిసిన
ఒక రహస్యమేదో
విచ్చుకుంటున్న
మొగ్గ లోంచి
సోకింది నాకు-
--ఇక ఆ తరువాత
ఎండను కప్పుకుని
ఆ పగలంతా
మన తోటల్లో
కురుస్తూనే ఉంది
---లిపి లేని ఒక
రహస్యపు వాన-
నీడలు ముసిరిన
నీ నల్లని కనులతో
ఈ వేకువలోకి
వచ్చాను నేను
ఇక నీకు తెలిసిన
ఒక రహస్యమేదో
విచ్చుకుంటున్న
మొగ్గ లోంచి
సోకింది నాకు-
--ఇక ఆ తరువాత
ఎండను కప్పుకుని
ఆ పగలంతా
మన తోటల్లో
కురుస్తూనే ఉంది
---లిపి లేని ఒక
రహస్యపు వాన-
ఒక అమ్మ
చినుకులు ముసిరిన చీకట్లలో
ఒక్కత్తే కూర్చుంటుంది ఒంటరిగా ఒక అమ్మ కొంత చీకటితో కొంత చిత్తడితో
ఇంకా ఇప్పుడే ఉన్నట్టు, ఇంకా ఇప్పుడే జరిగినట్టు
నువ్వు గుప్పిళ్ళతో చీకటిని వెన్నెలతో దూసి
తన ముఖాన్ని లేత రావి ఆకుల అరచేతులతో తడిమిన జ్ఞాపకం
నువ్వు పాకుతూ, పడుతూ లేస్తూ
నీటి నవ్వులతో పరిగెడుతూ
అటు తననీ ఇటు నిన్నూ
నింగికీ భూమికీ ముడివేసి
తన బొజ్జలో ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకున్న ఒక కలవరం
హోరున వీచే అవిసె చెట్లు
తిరిగి వచ్చే పక్షుల కలకలంతో జలదరించే ఉద్యానవనాలు
తల వంచుకున్న వీధి దీపాలపై
రాలే తొలి చినుకులూ, మూసుకుంటున్న ఏకాకి తలుపులూ
ఇవన్నీ తనై, ఇవన్నీ తన తనువై
చీకట్లు ముసిరిన చినుకులలో
ఒంటరిగా కూర్చుంటుంది ఒక్కత్తే ఒక అమ్మ కొంత దిగులుతో కొంత దహనంతో
కన్నీళ్ళతో బరువైన కళ్ళే తనవి
ఎదురుచూపులతో చిట్లి
కనుల కింద సాగిన నల్లని చారికల దారులే తనవి
నిన్ను అడగలేక, నిన్ను విడవలేక
ఎవరికీ చెప్పుకోలేక
నిన్ను హత్తుకుని నెత్తురోడిన చల్లటి చేతులే తనవి, పగిలిన అరి పాదాలే తనవి
గుమ్మానికి అనుకుని
తిరిగి ఇంటిలోకి తిరిగి చీకటిలోకి కదులుతూ, వీచే గాలిని మునివేళ్ళతో తాకిన
విలవిలలాడే పసి హృదయమే తనది
రాత్రిలోకి ఒక శిలయై, నీకై ఎదురు చూస్తూ కాలాన్ని చెక్కక మునుపు
తనకే తెలియదు, ఆ అమ్మకే తెలియదు
బాల్యంలో నిన్ను తను కొట్టినప్పుడు
ఇపుడు నువ్వు తనని చరచినప్పుడు
అపుడూ, ఇపుడూ
తనే ఎందుకు గుండె ఉగ్గపట్టుకుని ఏడ్చిందో-
08 June 2012
;-)
తెలిసింది నాకు ఇప్పుడు
---ఈ సృష్టి ఎలా
మొదలయ్యిందో -
శిరోభారం తాళలేక
బిగేసిన ముక్కుల్ని
__ భరించలేక__
ఆ సర్వంతర్యామే
కలవరించాడు
తన కలత నిద్రలో
-నిన్నూ తననూ
ఈ స్త్రీ పురుషుల
లోక కాలాల నిత్య
నీలి ఆహుతినూ-
(యిక ఆ తరువాత
అతను, వినోదానికై
ఇబ్బంది పడిన
దాఖలాలు లేవు-)
---ఈ సృష్టి ఎలా
మొదలయ్యిందో -
శిరోభారం తాళలేక
బిగేసిన ముక్కుల్ని
__ భరించలేక__
ఆ సర్వంతర్యామే
కలవరించాడు
తన కలత నిద్రలో
-నిన్నూ తననూ
ఈ స్త్రీ పురుషుల
లోక కాలాల నిత్య
నీలి ఆహుతినూ-
(యిక ఆ తరువాత
అతను, వినోదానికై
ఇబ్బంది పడిన
దాఖలాలు లేవు-)
:-)
గోడపై నేనూ
నాపై బల్లీ - తెగిన దాని తోక దానికి కనపడదు
రాత్రంతా
గదికి జలుబు చేసి
ముక్కులూ పట్టేసి
గాట్టిగా
ఓ తుమ్ము
-తుమ్మితే
ఈ ఉదయం
-ఇదిగో ఇల్లా
-తల పట్టేసిన
ఈ లోకంలోకి
ఓ రుమాలుతో
బయటపడ్డాను
శరీరాన్నీ
--ఆత్మనీ
చీదుకుంటో--
నాపై బల్లీ - తెగిన దాని తోక దానికి కనపడదు
రాత్రంతా
గదికి జలుబు చేసి
ముక్కులూ పట్టేసి
గాట్టిగా
ఓ తుమ్ము
-తుమ్మితే
ఈ ఉదయం
-ఇదిగో ఇల్లా
-తల పట్టేసిన
ఈ లోకంలోకి
ఓ రుమాలుతో
బయటపడ్డాను
శరీరాన్నీ
--ఆత్మనీ
చీదుకుంటో--
07 June 2012
మరొక తప్పు
-ఒక బీరు తాగడం
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండటమే ముఖ్యం- అయితే
ఏడు బీర్లు తాగాక
ఇంకో రెండు బీర్లు
ఇంటికి తెచ్చుకుని
ఆ రాత్రంతా తిరిగి రాని
రాత్రుళ్ళని తలచుకుని
ఒక్కడివే ఒక చేయి భూమిపై మరొక చేయి జాబిలిపై ఆన్చి
విశ్వపు చితిలో మెత్తగా
ఆ పూలమత్తుతో ఒరిగి
నీ ఆత్మతో అంటించుకుంటావు కదా నీ ఆత్మనీ నీ దిగులు శరీరాన్నీ
నీతో నువ్వు మాట్లాడుకునీ - విసిగీ
అలసీ అలసీ విసిగీ - మరి జహాపనా
చెప్పలేదా నీకెవ్వరూ
---ఒక మనిషి
బ్రతికుండగానే
అతని నెత్తురిని తాగి తాగి పీల్చి పీల్చి పిప్పి చేసి
యంత్రంగా రూకలుగా
మహా దారిధ్ర్యపు కీర్తిగా
ముడి సరుకుగా మార్చి
బహిరంగ విపణిలో అందమైన వస్తువుగా అమ్మడం
రక్త పిపాసిగా మార్చడం
------మధుపానం కంటే
మహా పాపమనీ నేరమనీ
అన్నిటినీ మించిన
మహా తప్పిదం అదేననీ?---
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండటమే ముఖ్యం- అయితే
ఏడు బీర్లు తాగాక
ఇంకో రెండు బీర్లు
ఇంటికి తెచ్చుకుని
ఆ రాత్రంతా తిరిగి రాని
రాత్రుళ్ళని తలచుకుని
ఒక్కడివే ఒక చేయి భూమిపై మరొక చేయి జాబిలిపై ఆన్చి
విశ్వపు చితిలో మెత్తగా
ఆ పూలమత్తుతో ఒరిగి
నీ ఆత్మతో అంటించుకుంటావు కదా నీ ఆత్మనీ నీ దిగులు శరీరాన్నీ
నీతో నువ్వు మాట్లాడుకునీ - విసిగీ
అలసీ అలసీ విసిగీ - మరి జహాపనా
చెప్పలేదా నీకెవ్వరూ
---ఒక మనిషి
బ్రతికుండగానే
అతని నెత్తురిని తాగి తాగి పీల్చి పీల్చి పిప్పి చేసి
యంత్రంగా రూకలుగా
మహా దారిధ్ర్యపు కీర్తిగా
ముడి సరుకుగా మార్చి
బహిరంగ విపణిలో అందమైన వస్తువుగా అమ్మడం
రక్త పిపాసిగా మార్చడం
------మధుపానం కంటే
మహా పాపమనీ నేరమనీ
అన్నిటినీ మించిన
మహా తప్పిదం అదేననీ?---
తప్పు
-ఒక బీరు తాగడం
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండడమే ముఖ్యం
ఏడు బీర్లు తాగాక
నీ గుండె పొగిలి
ఏడవాలనిపించీ
కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాకపోతే
యిక అంతకంటే
మరో మృత్యువు
__ఏముంది__?
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండడమే ముఖ్యం
ఏడు బీర్లు తాగాక
నీ గుండె పొగిలి
ఏడవాలనిపించీ
కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాకపోతే
యిక అంతకంటే
మరో మృత్యువు
__ఏముంది__?
ఒక రోజు
నెలవంకల వంటి
ఎండ కనురెప్పల
_________ కింద ఆ రోజంతా ఇలాగే గడిపాను
అదే గదిలో , నువ్వు
అలా నిస్త్రాణగా లేచి
వెళ్ళిపోయిన గదిలో
__________ వెళ్ళిన నీ నిట్టూర్పు
__________ వేడిగా వీచే నీ గదిలో
ఆ మంచంపై బోర్లా పడుకుని
గాలి నీళ్ళల్లో చేతులూపుతూ
సాయంత్రం దాకా
పాల నేలపై రాలిన
నా రాతి ముఖాన్ని
---చూసుకుంటూ
మాట్లాడుకుంటూ
మళ్ళా నువ్వొచ్చి విసురుగా
పెరటి తలుపులు తెరచి
రాత్రిని లోపలి పిలిచేదాకా
ఒక్కడినే అనేకమందిని అయ్యి
నా ఒక్కడికే నాలో బందీ అయ్యి
-ఇకా రోజంతా అలాగే
నిమ్మళంగా గడిపాను-
--ఇంతకూ
వస్తూ వస్తూ
--మనకు--
మన చీకటింట వంటింట్లో
పొయ్యి వెలిగించేందుకు
_____________ ఇన్ని బియ్యం
_____________ అన్ని కూరగాయలూ
_____________ తెచ్చావా
నీ దినవారీ నిందలతో పాటూ
నీ తనువంత ప్రేమ శాపలతో
నీ జీవితపు వేదనతో పాటూ?
ఎండ కనురెప్పల
_________ కింద ఆ రోజంతా ఇలాగే గడిపాను
అదే గదిలో , నువ్వు
అలా నిస్త్రాణగా లేచి
వెళ్ళిపోయిన గదిలో
__________ వెళ్ళిన నీ నిట్టూర్పు
__________ వేడిగా వీచే నీ గదిలో
ఆ మంచంపై బోర్లా పడుకుని
గాలి నీళ్ళల్లో చేతులూపుతూ
సాయంత్రం దాకా
పాల నేలపై రాలిన
నా రాతి ముఖాన్ని
---చూసుకుంటూ
మాట్లాడుకుంటూ
మళ్ళా నువ్వొచ్చి విసురుగా
పెరటి తలుపులు తెరచి
రాత్రిని లోపలి పిలిచేదాకా
ఒక్కడినే అనేకమందిని అయ్యి
నా ఒక్కడికే నాలో బందీ అయ్యి
-ఇకా రోజంతా అలాగే
నిమ్మళంగా గడిపాను-
--ఇంతకూ
వస్తూ వస్తూ
--మనకు--
మన చీకటింట వంటింట్లో
పొయ్యి వెలిగించేందుకు
_____________ ఇన్ని బియ్యం
_____________ అన్ని కూరగాయలూ
_____________ తెచ్చావా
నీ దినవారీ నిందలతో పాటూ
నీ తనువంత ప్రేమ శాపలతో
నీ జీవితపు వేదనతో పాటూ?
06 June 2012
నీదేనా?
శరీరం పైనంతా చీకటి
ఆర్పివేసిన దీపంలోంచి
సన్నటి పొగ
నీ చేతులై పెదాలై
నీ మెత్తని నాలికై
-చుట్టుకుంటోంది-
ఇంతకూ
నీ తలుపుకు అవతల
ఆ నునుపైన జూలుతో
ఆవలించుకుంటూ
అసహనంగా కదిలే
ఆ బూడిద రంగు పిల్లీ
దాని లేతెరుపు నాలికా
దాని ఎర్రని కళ్ళ చారాల కోరల కోరికా నీదేనా?
ఆర్పివేసిన దీపంలోంచి
సన్నటి పొగ
నీ చేతులై పెదాలై
నీ మెత్తని నాలికై
-చుట్టుకుంటోంది-
ఇంతకూ
నీ తలుపుకు అవతల
ఆ నునుపైన జూలుతో
ఆవలించుకుంటూ
అసహనంగా కదిలే
ఆ బూడిద రంగు పిల్లీ
దాని లేతెరుపు నాలికా
దాని ఎర్రని కళ్ళ చారాల కోరల కోరికా నీదేనా?
05 June 2012
తేనె
నేలపై
పగిలిన తేనె నిండిన గాజుపాత్ర చుట్టూ చక్కగా చీమలు
ఆ పక్కగా మంచంపై విరిగి
మధువు నిండిన శరీరంతో
ఇరువై గంటలకు పైగా స్పృహ తప్పి
తేనె తాగివేయబడి వడలిన
ఆ పూల ముఖంతో అతను-
ఇంతకూ అతని గదిలోకి
నిత్య దినాల శ్రమతో
తేనెను సేకరించి తెచ్చిన
ఆ పగిలిన పాదాలు
అ పగిలిన పెదాలూ
ఆ పగిలిన చేతులూ ఏ శోకపు స్త్రీవి?
పగిలిన తేనె నిండిన గాజుపాత్ర చుట్టూ చక్కగా చీమలు
ఆ పక్కగా మంచంపై విరిగి
మధువు నిండిన శరీరంతో
ఇరువై గంటలకు పైగా స్పృహ తప్పి
తేనె తాగివేయబడి వడలిన
ఆ పూల ముఖంతో అతను-
ఇంతకూ అతని గదిలోకి
నిత్య దినాల శ్రమతో
తేనెను సేకరించి తెచ్చిన
ఆ పగిలిన పాదాలు
అ పగిలిన పెదాలూ
ఆ పగిలిన చేతులూ ఏ శోకపు స్త్రీవి?
ఇలా
తరిమే ధూళికి
వేలాడుతున్నది రాలబోయే పూవు
తన తనువునంతా ఉగ్గపట్టుకుని
తనని వొదిలివేయబోయే కొమ్మకు-
ఆ సాయంత్రమే
ఆఖరు సారిగా
చూసింది నిన్ను-
యిక ఆ తరువాత
-మరొక ముఖంతో
నా ముఖం
-కడుక్కుని
నీ లాంటి ఆ చేతులలో
ముడుచుకుని
నిదురించలేదు
యిక నేను ఎన్నడూ-
వేలాడుతున్నది రాలబోయే పూవు
తన తనువునంతా ఉగ్గపట్టుకుని
తనని వొదిలివేయబోయే కొమ్మకు-
ఆ సాయంత్రమే
ఆఖరు సారిగా
చూసింది నిన్ను-
యిక ఆ తరువాత
-మరొక ముఖంతో
నా ముఖం
-కడుక్కుని
నీ లాంటి ఆ చేతులలో
ముడుచుకుని
నిదురించలేదు
యిక నేను ఎన్నడూ-
అర్హత
సరే సరే
నీళ్ళు పోయని హస్తాలకు
పూలను తాకే అర్హత లేదు
కానీ
వడలిన నా వదనాన్నీ
మోకరిల్లిన తనువునీ
తాకే
దయా మమకారం లేవా
నీకు?
నీళ్ళు పోయని హస్తాలకు
పూలను తాకే అర్హత లేదు
కానీ
వడలిన నా వదనాన్నీ
మోకరిల్లిన తనువునీ
తాకే
దయా మమకారం లేవా
నీకు?
తెలియదు
ఆకుల చెమ్మ రాలే
చీకటి పూలపై మెరుస్తూ వెళ్ళిపోతుంది గాలి
యిక
నుదిటిన తడిని
తుడుచుకుంటూ
లేస్తావు ఒక్కడివే
కనురెప్పల్ని విద్యుత్కాంతి అంటుకున్న గోడలపై తగలబెడుతో-
ఎందుకొచ్చిందీ మెలకువ
నడి రాత్రి రెండింటికి
దిగులు దిగంతాలని
వెంటేసుకుని
నిదురించిన నయనాలని ఊచకోత కోస్తో?
చీకటి పూలపై మెరుస్తూ వెళ్ళిపోతుంది గాలి
యిక
నుదిటిన తడిని
తుడుచుకుంటూ
లేస్తావు ఒక్కడివే
కనురెప్పల్ని విద్యుత్కాంతి అంటుకున్న గోడలపై తగలబెడుతో-
ఎందుకొచ్చిందీ మెలకువ
నడి రాత్రి రెండింటికి
దిగులు దిగంతాలని
వెంటేసుకుని
నిదురించిన నయనాలని ఊచకోత కోస్తో?
04 June 2012
ఈ జన్మ
రాసినదంతా
వెనుకనుంచి
ఒక్కొక్క అక్షరమే తుడుపుకుంటూ
ఒక్కొక్క పదమే
అద్రుశ్యమవుతూ
చివరకు
ఆ తెలుపు కూడా మిగలని
తెల్లటి కాగితం కావాలి నేను
సాధ్యమా అది?
నను గన్న, నన్ గనీ
తనకు తాను
ఇతరమైన నా తల్లీ?
వెనుకనుంచి
ఒక్కొక్క అక్షరమే తుడుపుకుంటూ
ఒక్కొక్క పదమే
అద్రుశ్యమవుతూ
చివరకు
ఆ తెలుపు కూడా మిగలని
తెల్లటి కాగితం కావాలి నేను
సాధ్యమా అది?
నను గన్న, నన్ గనీ
తనకు తాను
ఇతరమైన నా తల్లీ?
జ్ఞానదంతం అను నా నాలిక ;-)
నీ నాలిక
అదొక ఒక కుక్క తోక, అదొక వానరం కూడా-
దారిన పోయే వాళ్ళని అది వదలదు
అలా అని పోనీ తను
నిమ్మళంగా ఉండదు
యుగాంతం నుంచి
--యుగాంతం దాకా
తన మహా వాచకానికి తనే కాపలా అదే నిరంతర పద ముద్రణ
నిలువెత్తు తన జ్ఞాన ప్రదర్సన సభలో
తన అనుకురణ అర్పితులైన జిహ్వల మందలతో సాహితీ సేవలో
యిక దివారాత్రులూ తనే కీర్తికి తనే పహారా-
ఒరే, ఒరోరే
ఇంతా చేసీ
--నీకొక పదం చిక్కదు
నాకొక శిల్పం అందదు
--అందుకే
ఒరే నాయనా
జ్ఞానపు బరువుతో, అరువు అక్షరాల రుణాలతో
--అంతిమంగా
ఉరివేసుకున్న
ఒక ఒంటరి వానర శునకపు నాలిక తోకని
____ఊహించావా ఎపుడైనా?_______
అదొక ఒక కుక్క తోక, అదొక వానరం కూడా-
దారిన పోయే వాళ్ళని అది వదలదు
అలా అని పోనీ తను
నిమ్మళంగా ఉండదు
యుగాంతం నుంచి
--యుగాంతం దాకా
తన మహా వాచకానికి తనే కాపలా అదే నిరంతర పద ముద్రణ
నిలువెత్తు తన జ్ఞాన ప్రదర్సన సభలో
తన అనుకురణ అర్పితులైన జిహ్వల మందలతో సాహితీ సేవలో
యిక దివారాత్రులూ తనే కీర్తికి తనే పహారా-
ఒరే, ఒరోరే
ఇంతా చేసీ
--నీకొక పదం చిక్కదు
నాకొక శిల్పం అందదు
--అందుకే
ఒరే నాయనా
జ్ఞానపు బరువుతో, అరువు అక్షరాల రుణాలతో
--అంతిమంగా
ఉరివేసుకున్న
ఒక ఒంటరి వానర శునకపు నాలిక తోకని
____ఊహించావా ఎపుడైనా?_______
ఎటువంటి లోకం అంటే
ఒరే
ఎటువంటి లోకంరా యిది అంటే
ఆకులలో దాగిన
పక్షి గూడుని అబ్బురంగా చూపిస్తావా వాళ్లకి
హాయిగా గాలి కూసే రాత్రుళ్ళలో ఆ వెన్నెల్లో
మరి
-పక్షినీ అది పొదిగే గుడ్లనీ
కాల్చుకు తినే కాలమిదనీ
లోకమిదనీ
ఎవరేనా చెప్పారా నీకు?
ఎటువంటి లోకంరా యిది అంటే
ఆకులలో దాగిన
పక్షి గూడుని అబ్బురంగా చూపిస్తావా వాళ్లకి
హాయిగా గాలి కూసే రాత్రుళ్ళలో ఆ వెన్నెల్లో
మరి
-పక్షినీ అది పొదిగే గుడ్లనీ
కాల్చుకు తినే కాలమిదనీ
లోకమిదనీ
ఎవరేనా చెప్పారా నీకు?
తుమ్మముళ్ళు
ఆక్కడ
ఆ తుమ్మ చెట్ల మధ్యగా
-మెలికలు తిరుగుతుంది
ఆ ఇరుకిరుకు మట్టి దారి
స్థాణువై నువ్వు
చూస్తుండగానే
గలగలలాడతాయి నీడలు
గాలికి తేలిపోయే
ఆ మట్టి దారిలో:
నీళ్ళు కొమ్మలయినట్టు
-కొమ్మలు ఆకులైనట్టు
ఆకులు పచ్చగా పూలై ముళ్ళుగా వికసించినట్టు
హాయిగా కదిలే
మబ్బుల ఆకాశం కింద
అలా ఉంటాయి
నిర్మలంగా
కాంతిగా
దయగా
ఆప్తంగా
నిన్ను చూసే తుమ్మ ముళ్ళు-
అద్దంలో
నువ్వు చూసుకునే
కనుల అంచున చిట్లే
నువ్వైన చల్లటి
తుమ్మముళ్ళు-
అయితే, ఇంతకూ
నువ్వెపుడైనా
ఆ తుమ్మముళ్ళ
రేపటి కన్నీటిని
రుచి చూసావా?
ఆ తుమ్మ చెట్ల మధ్యగా
-మెలికలు తిరుగుతుంది
ఆ ఇరుకిరుకు మట్టి దారి
స్థాణువై నువ్వు
చూస్తుండగానే
గలగలలాడతాయి నీడలు
గాలికి తేలిపోయే
ఆ మట్టి దారిలో:
నీళ్ళు కొమ్మలయినట్టు
-కొమ్మలు ఆకులైనట్టు
ఆకులు పచ్చగా పూలై ముళ్ళుగా వికసించినట్టు
హాయిగా కదిలే
మబ్బుల ఆకాశం కింద
అలా ఉంటాయి
నిర్మలంగా
కాంతిగా
దయగా
ఆప్తంగా
నిన్ను చూసే తుమ్మ ముళ్ళు-
అద్దంలో
నువ్వు చూసుకునే
కనుల అంచున చిట్లే
నువ్వైన చల్లటి
తుమ్మముళ్ళు-
అయితే, ఇంతకూ
నువ్వెపుడైనా
ఆ తుమ్మముళ్ళ
రేపటి కన్నీటిని
రుచి చూసావా?
ధైర్యం
నిదుర లేచి
అలా తేలికగా కళ్ళు విప్పుతావు కదా నువ్వు , అప్పుడు
బద్ధకంగా వికసిస్తుంది
ఒక తామరపూల తోట
చిరునవ్వు కదులాడే
గుండ్రటి నీ చక్కటి పసిడి ముఖంలో
రాత్రి నువ్వు కలగన్న
-రహస్యంగా తడిచిన
నీ కలల ఆకుల పచ్చి సువాసనతో-
ఆహ్, యిక నేను
-బ్రతికేందుకు
ఈ లోకంలోకి
ధైర్యంగా కవాతు చేసుకుంటూ వెళ్ళవచ్చు
నీ పెదాల మధ్య మెరిసిన
తెల్లని దానిమ్మ గింజల
చీకటి నీడలలో మెరిసిన కాంతి పుంజాల
ఆ నీ చిన్ని పళ్ళ వరసను
సదా మననం చేసుకుంటో-
అలా తేలికగా కళ్ళు విప్పుతావు కదా నువ్వు , అప్పుడు
బద్ధకంగా వికసిస్తుంది
ఒక తామరపూల తోట
చిరునవ్వు కదులాడే
గుండ్రటి నీ చక్కటి పసిడి ముఖంలో
రాత్రి నువ్వు కలగన్న
-రహస్యంగా తడిచిన
నీ కలల ఆకుల పచ్చి సువాసనతో-
ఆహ్, యిక నేను
-బ్రతికేందుకు
ఈ లోకంలోకి
ధైర్యంగా కవాతు చేసుకుంటూ వెళ్ళవచ్చు
నీ పెదాల మధ్య మెరిసిన
తెల్లని దానిమ్మ గింజల
చీకటి నీడలలో మెరిసిన కాంతి పుంజాల
ఆ నీ చిన్ని పళ్ళ వరసను
సదా మననం చేసుకుంటో-
03 June 2012
బహుమతి
ఈ రాత్రిని
ఒక మల్లెపూల దండగా మార్చి నీకు ఇస్తున్నాను
పగలంతా పనికి అలసి- స్నానం చేసి
కురులు ఆర్పుకుంటూ
నుదిటిన కుంకుమతో
కొన వేలితో అలవోకగా
కాటుక రాసుకుంటూ
ఆ అద్దంలోంచి నన్ను
చిరునవ్వులతో చూసే
నీ వాలుచూపులతోనే
నీ కురులలో నన్ను
తురుముకుని
గాయాలు లేక
ఒకింత హాయిగా
ఈ వేళ నిదురించు-
ఒక మల్లెపూల దండగా మార్చి నీకు ఇస్తున్నాను
పగలంతా పనికి అలసి- స్నానం చేసి
కురులు ఆర్పుకుంటూ
నుదిటిన కుంకుమతో
కొన వేలితో అలవోకగా
కాటుక రాసుకుంటూ
ఆ అద్దంలోంచి నన్ను
చిరునవ్వులతో చూసే
నీ వాలుచూపులతోనే
నీ కురులలో నన్ను
తురుముకుని
గాయాలు లేక
ఒకింత హాయిగా
ఈ వేళ నిదురించు-
ఆర్పివేయకు
నీ కనుల అంచున
నిలిచి ఉందీ రాత్రి-
నీ అశ్రువు
ఈ ధరిత్రి అంత బరువని
ఈనాడే తెలిసింది
యిక
అప్పుడే దీపం ఆర్పివేయకు
నీ ముఖాన్నీ
చీకటి నీడల్లో
వొదిలివేయకు-
నిలిచి ఉందీ రాత్రి-
నీ అశ్రువు
ఈ ధరిత్రి అంత బరువని
ఈనాడే తెలిసింది
యిక
అప్పుడే దీపం ఆర్పివేయకు
నీ ముఖాన్నీ
చీకటి నీడల్లో
వొదిలివేయకు-
అతనిని?
చీకటిలో
ఊగుతోంది నీటి పుష్పం ఒక అనాధయై, ఒక పసి పిల్లై
నీ కళ్ళల్లో
యిక ఆ సర్ప సంగ్రామ రాత్రంతా
సుడులు తిరుగుతూ నీతో నువ్వే
తన తనువంత
మధుపాత్రతో
మరుపులేని
తన చేయంత
ప్రేమ విషంతో
ఒక బకార్డి బాటిల్తో -
-పలుకరించావా
ఎపుడైనా నువ్వు
అతనిని?-
ఊగుతోంది నీటి పుష్పం ఒక అనాధయై, ఒక పసి పిల్లై
నీ కళ్ళల్లో
యిక ఆ సర్ప సంగ్రామ రాత్రంతా
సుడులు తిరుగుతూ నీతో నువ్వే
తన తనువంత
మధుపాత్రతో
మరుపులేని
తన చేయంత
ప్రేమ విషంతో
ఒక బకార్డి బాటిల్తో -
-పలుకరించావా
ఎపుడైనా నువ్వు
అతనిని?-
02 June 2012
ఒక నల్లని పిల్ల
సముద్ర వనంలో పూచిన
కలువ కళ్ళ నల్లని చేప పిల్ల ఆ పిల్ల
గంపనెత్తుకుని
తిరుగుతోంది
ఆకాశం దాచిన భూమి చుట్టూ
ఒక ప్రాచీన ఆకలిని
ఆగీ ఆగీ గుర్తుకు తెస్తో
---సాగిపోతోంది తనని
దాచుకున్న నీ చుట్టూ
------నిండైన ఒళ్ళు గల
ముద్దబంతిలాంటి ఆ పిల్ల-
బొడ్డులో దోచిన
ఎర్రటి పమిటా
కాలికి మెరిసే
ఆ వెండి పట్టా
-సిగలో పూలూ
నడకలో వాలు-
వలేసి నీ
చూపుల్ని
పట్టుకుని
--వడి వడిగా
వెళ్లి పోతుంది
పచ్చిరొయ్యల
ఉప్పు నీటి వాసనతో
కొరమేను తనువుతో
ఆ నీలి సముద్రపు
ఇసుక ఉంగరాల్లో
తటాలున దాక్కునే
చిన్ని పీతల
చిరునవ్వుతో
గంపెడెంత ఆశ
తీసుకు వచ్చిన
గమ్మతైన ఆ పిల్ల
నీలి నీలాల సీతాకోకచిలుకలు వాలిన
..మెత్తని కోరలున్నఆ పిల్ల
వెన్నెల పులిలాంటి ఆ పిల్ల
విధ్యుత్ఘాతం వంటి
తన నల్లని కళ్ళతో
నీ ప్రాణాల్ని గేలం వేసి
తనతో లాక్కు వెళ్ళే
తెల్లని కోరికైన
ఆ నల్లని పిల్ల-
సరే సరే
అది సరే కానీ
ఆకలిగా లేదూ
నీకు ఇంతకూ?
కలువ కళ్ళ నల్లని చేప పిల్ల ఆ పిల్ల
గంపనెత్తుకుని
తిరుగుతోంది
ఆకాశం దాచిన భూమి చుట్టూ
ఒక ప్రాచీన ఆకలిని
ఆగీ ఆగీ గుర్తుకు తెస్తో
---సాగిపోతోంది తనని
దాచుకున్న నీ చుట్టూ
------నిండైన ఒళ్ళు గల
ముద్దబంతిలాంటి ఆ పిల్ల-
బొడ్డులో దోచిన
ఎర్రటి పమిటా
కాలికి మెరిసే
ఆ వెండి పట్టా
-సిగలో పూలూ
నడకలో వాలు-
వలేసి నీ
చూపుల్ని
పట్టుకుని
--వడి వడిగా
వెళ్లి పోతుంది
పచ్చిరొయ్యల
ఉప్పు నీటి వాసనతో
కొరమేను తనువుతో
ఆ నీలి సముద్రపు
ఇసుక ఉంగరాల్లో
తటాలున దాక్కునే
చిన్ని పీతల
చిరునవ్వుతో
గంపెడెంత ఆశ
తీసుకు వచ్చిన
గమ్మతైన ఆ పిల్ల
నీలి నీలాల సీతాకోకచిలుకలు వాలిన
..మెత్తని కోరలున్నఆ పిల్ల
వెన్నెల పులిలాంటి ఆ పిల్ల
విధ్యుత్ఘాతం వంటి
తన నల్లని కళ్ళతో
నీ ప్రాణాల్ని గేలం వేసి
తనతో లాక్కు వెళ్ళే
తెల్లని కోరికైన
ఆ నల్లని పిల్ల-
సరే సరే
అది సరే కానీ
ఆకలిగా లేదూ
నీకు ఇంతకూ?
భిక్ష
నీ కళ్ళని
తీసి అరచేతుల్లో ఉంచుకున్నావా
నీ కాళ్ళని
మేలుకొలిపి బయట అడుగుపెట్టావా
నీ హృదయాన్ని
శుభ్రంగా విదిల్చి
మరొక మరణానికై సంసిద్ధం చేసావా
నీ శరీరాన్ని
రాత్రి చద్ది మూట కట్టుకుని
ఈ లోకంలోకి సాగనంపావా
--తాళం వేయకు పెదాలకి
తెగుతాయని తెలిసినా
తెరిచే ఉంచు బాహువులని
చెమర్చిన
కన్నీళ్లను
తాగేందుకు ఉంచుకో
దాచుకుని బొడ్డులో
--ఒక మధుపాత్రని
------ఆ గుప్పిళ్ళలో
రహస్యంగా అట్టేపెట్టు
ఒక జీవన తేనె పిట్టని--
పద పద పద ప
-యిక మనం
ఈ లోకంలోకి
మనుషులని మనుషులకై
----అడుక్కునే వేళయ్యింది--
తీసి అరచేతుల్లో ఉంచుకున్నావా
నీ కాళ్ళని
మేలుకొలిపి బయట అడుగుపెట్టావా
నీ హృదయాన్ని
శుభ్రంగా విదిల్చి
మరొక మరణానికై సంసిద్ధం చేసావా
నీ శరీరాన్ని
రాత్రి చద్ది మూట కట్టుకుని
ఈ లోకంలోకి సాగనంపావా
--తాళం వేయకు పెదాలకి
తెగుతాయని తెలిసినా
తెరిచే ఉంచు బాహువులని
చెమర్చిన
కన్నీళ్లను
తాగేందుకు ఉంచుకో
దాచుకుని బొడ్డులో
--ఒక మధుపాత్రని
------ఆ గుప్పిళ్ళలో
రహస్యంగా అట్టేపెట్టు
ఒక జీవన తేనె పిట్టని--
పద పద పద ప
-యిక మనం
ఈ లోకంలోకి
మనుషులని మనుషులకై
----అడుక్కునే వేళయ్యింది--
01 June 2012
నీ/ద్వేష గీతాలు 1
అతన కథలు చెప్పే మనిషి.
మార్చి నెల పొల మారిన ఆ కాలంలో ఆ సాయంత్రం ఆ రాత్రంతా వర్షం పడింది. తను సాయంత్రం కాక మునుపు వచ్చింది మబ్బులు కమ్ముకున్న ఆకాశాన్ని చుట్టుకుని నిమ్మకాయ రంగుల వాసనలతో: నేను కాదనలేక పోయాను. ఒక నిలువెత్తు పసిడి గులాబీని నా వెంట ఆ దినం ఈ నగర లోహ రహదారులని చూపించేందుకు తీసుకు వెళ్లాను. తెల్లటి పావురాళ్ళు ముడుచుకున్న కళ్ళతో తను నా కళ్ళలోంచి నా అరచేతుల లోంచి లోకంలోకి ఎగిరింది. తారు వాసనలనీ, ఎత్తైన నలు చదరపు శరీరాల్నీ, నాచు పట్టిన గుర్రపు డెక్కల సరస్సులనీ రహదారుల పక్కగా బూజు పట్టిన పసి కళ్ళనీ నిరంతరంగా సాగే జనుల ఆధుర్ధానీ స్థాణువై చూసి, నా హృదయంలో గూడు కట్టుకునేందుకు మసకబారిన మనస్సుతో వాటిని తిరిగి కథలలా తీసుకు వచ్చింది.
అతను అన్నాడు: ఇది జీవితం. ఊరుకో. హత్యలకు గురికాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ.
యిక ఆ సాయంత్రం ఆ రాత్రంతా వర్షం పడింది. పూర్తిగా తడిచి వణుకుతూ, తన లోకి తాను ముడుచుకుపోతూ తను బేలగా ఆర్ధించింది- నన్ను ఉండనివ్వు ఈ పూట నీ గదిలో, ఇప్పుడు వెళ్ళలేను బయటకి, జిగటగా చీకటి అల్లుకున్న రాత్రిలోకి. ఈ పూట ఉంటాను నీ గదిలో నాకు నేనే తోడుగా, పడుకుంటాను నీతో నీకూ నాకూ తోడుగా. ఉండనివ్వు నన్ను - యిక ఈ పూటకి, ఇప్పటికే అలసిపోయాను రక్తపిపాసులు తిరిగే ఆ రహదారుల్లో, అని అంది తను ముకుళించిన అరచేతులతో, తొలగిన పమిటలోంచి గతపు గాయాలతో నెత్తురు ఓడుతున్న వక్షోజాలతో.
అతను నవ్వాడు. అతను తడబడ్డాడు. అతను అన్నాడు: ఊరుకో. యిదే జీవితం. యిదే పవిత్ర పాపుల కాలం. అని అతను తనని భక్షించి ఆనక రాత్రి వ్యాఘ్రం తిరుగాడే నీటి చినుకుల శిధిలాలలోకీ కాల బిలాలలోకి తనని తోసివేసాడు. తను వెళ్లిపోయింది అక్కడ నుంచి, ఎదపై నిదురించిన ఇద్దరు పసి పిల్లలని లేపుకుని ఆ నిశి రాత్రిలో, ఆ కాటుక వానలో వొణికే కడుపుతో తడిచీ పూర్తిగా ఎండిపోయిన హృదయంతో-
తిరిగి రాని తను మీకు ఎక్కడైనా కనిపించిందా అని రాస్తోన్నాడు అతను ఇదంతా పుక్కిలి పట్టిన దిగులుతో ఏడుపుతో తనని నిరంతరం వేటాడే ఆ మృణ్మయ పాత్రల కనులతో ఆ రాత్రంతా ఆ సాయంత్రమంతా కురిసిన ఎవరూ లేని ఇళ్ళు లేని ఆ వర్షం గురించి- ఏమీ లేదు
అతను కథలు చెప్పే మనిషి.
అతను అన్నాడు: ఇది జీవితం. ఊరుకో. హత్యలకు గురికాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ.
యిక ఆ సాయంత్రం ఆ రాత్రంతా వర్షం పడింది. పూర్తిగా తడిచి వణుకుతూ, తన లోకి తాను ముడుచుకుపోతూ తను బేలగా ఆర్ధించింది- నన్ను ఉండనివ్వు ఈ పూట నీ గదిలో, ఇప్పుడు వెళ్ళలేను బయటకి, జిగటగా చీకటి అల్లుకున్న రాత్రిలోకి. ఈ పూట ఉంటాను నీ గదిలో నాకు నేనే తోడుగా, పడుకుంటాను నీతో నీకూ నాకూ తోడుగా. ఉండనివ్వు నన్ను - యిక ఈ పూటకి, ఇప్పటికే అలసిపోయాను రక్తపిపాసులు తిరిగే ఆ రహదారుల్లో, అని అంది తను ముకుళించిన అరచేతులతో, తొలగిన పమిటలోంచి గతపు గాయాలతో నెత్తురు ఓడుతున్న వక్షోజాలతో.
అతను నవ్వాడు. అతను తడబడ్డాడు. అతను అన్నాడు: ఊరుకో. యిదే జీవితం. యిదే పవిత్ర పాపుల కాలం. అని అతను తనని భక్షించి ఆనక రాత్రి వ్యాఘ్రం తిరుగాడే నీటి చినుకుల శిధిలాలలోకీ కాల బిలాలలోకి తనని తోసివేసాడు. తను వెళ్లిపోయింది అక్కడ నుంచి, ఎదపై నిదురించిన ఇద్దరు పసి పిల్లలని లేపుకుని ఆ నిశి రాత్రిలో, ఆ కాటుక వానలో వొణికే కడుపుతో తడిచీ పూర్తిగా ఎండిపోయిన హృదయంతో-
తిరిగి రాని తను మీకు ఎక్కడైనా కనిపించిందా అని రాస్తోన్నాడు అతను ఇదంతా పుక్కిలి పట్టిన దిగులుతో ఏడుపుతో తనని నిరంతరం వేటాడే ఆ మృణ్మయ పాత్రల కనులతో ఆ రాత్రంతా ఆ సాయంత్రమంతా కురిసిన ఎవరూ లేని ఇళ్ళు లేని ఆ వర్షం గురించి- ఏమీ లేదు
అతను కథలు చెప్పే మనిషి.
ఎందుకంటే
సరైన సమయంలో
---ఒక సరైన పదం
సరైన సమయంలో
--ఒక సరైన హస్తం
సరైన సమయంలో
ఓ సరైన ఆలింగనం
నీకు దక్కి ఉంటే--
చెమ్మగిల్లిన కళ్ళతో
నువ్వలా పట్టాలపై
---- ----చీకట్లో ఒంటరిగా
తెగిన జాబిలి కింద
రాలిన నెత్తురులో
రైలుకి ఎదురు వెళ్లి
---ఉండక పోదువు-----
---ఒక సరైన పదం
సరైన సమయంలో
--ఒక సరైన హస్తం
సరైన సమయంలో
ఓ సరైన ఆలింగనం
నీకు దక్కి ఉంటే--
చెమ్మగిల్లిన కళ్ళతో
నువ్వలా పట్టాలపై
---- ----చీకట్లో ఒంటరిగా
తెగిన జాబిలి కింద
రాలిన నెత్తురులో
రైలుకి ఎదురు వెళ్లి
---ఉండక పోదువు-----
ఎలా?
మసక తీగల ధూపంలా
చీకట్లో ఆ ముఖం వద్దకి
-------------- సాగుతాయి నీ రెండు అరచేతులు
ఆ సరస్సులోకి దూకినట్టు
ప్రేమగా రెక్కలు విప్పుకుని
తటాలున సీతాకోక చిలుకలు పచ్చని ఆకులపై నుంచి కదిలినట్టు
గూళ్ళలోంచి
తలలు బయటపెట్టి పిచ్చుక పిల్లలు చూస్తుండగా
---------------------నింగికి పిచ్చుకలు ఎగిరినట్టు
కన్నీటి వాసన వేసే
---ఆ ముఖం వద్దకి
సాగుతాయి నీ రెండు అరచేతులు, పచ్చి గాయంతో
---ఒక మరుపు లేని తనంతో తన తనువు తనంతో-
యిక ఆ తరువాత
నువ్వు నువ్వులా
ఎలా ఉండగలావ్?
చీకట్లో ఆ ముఖం వద్దకి
-------------- సాగుతాయి నీ రెండు అరచేతులు
ఆ సరస్సులోకి దూకినట్టు
ప్రేమగా రెక్కలు విప్పుకుని
తటాలున సీతాకోక చిలుకలు పచ్చని ఆకులపై నుంచి కదిలినట్టు
గూళ్ళలోంచి
తలలు బయటపెట్టి పిచ్చుక పిల్లలు చూస్తుండగా
---------------------నింగికి పిచ్చుకలు ఎగిరినట్టు
కన్నీటి వాసన వేసే
---ఆ ముఖం వద్దకి
సాగుతాయి నీ రెండు అరచేతులు, పచ్చి గాయంతో
---ఒక మరుపు లేని తనంతో తన తనువు తనంతో-
యిక ఆ తరువాత
నువ్వు నువ్వులా
ఎలా ఉండగలావ్?
ఆ ఒక్కరు
రాత్రి బల్లపై
రాలిన పూవుని అరచేతుల్లోకి తీసుకుని
రాలిన పూవుని అరచేతుల్లోకి తీసుకుని
చికిలించిన కళ్ళలో
-------------చిట్లిన నీళ్ళను తుడుచుకుంటూ
-------------చిట్లిన నీళ్ళను తుడుచుకుంటూ
ఒక మూలకు ఒదిగి కూర్చుంటావు నువ్వు-
కమిలిన గాలి
వెక్కిళ్ళ చీకటి
వెక్కిళ్ళ ఊపిరి-
యిక
యిదే సరైన సమయం నీకు
--అద్దంలో చిట్లిన తన ముఖాన్ని
నీ మణికట్టు అంచున ఉంచుకుని
నింపాదిగా కోసుకునేందుకు---
కమిలిన గాలి
వెక్కిళ్ళ చీకటి
వెక్కిళ్ళ ఊపిరి-
యిక
యిదే సరైన సమయం నీకు
--అద్దంలో చిట్లిన తన ముఖాన్ని
నీ మణికట్టు అంచున ఉంచుకుని
నింపాదిగా కోసుకునేందుకు---
ఊబి
గాజు దీపం
గదిలో చిట్లి
చీకటిని చితాభస్మంలా వెదజల్లే వేళల్లో
అరచేతుల మధ్యకు
ఒక మృత వదనం
కూరుకు పోతుంది
-యిక, అవతలగా
ఆ గాలిలో తేలే
పసిడి వెన్నెల నీతో ఎన్నడూ మాట్లాడదు-
గదిలో చిట్లి
చీకటిని చితాభస్మంలా వెదజల్లే వేళల్లో
అరచేతుల మధ్యకు
ఒక మృత వదనం
కూరుకు పోతుంది
-యిక, అవతలగా
ఆ గాలిలో తేలే
పసిడి వెన్నెల నీతో ఎన్నడూ మాట్లాడదు-
Subscribe to:
Posts (Atom)